బిజినెస్

తగ్గనున్న ఆదాయం! కేంద్రానికి గడ్డుకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి పరిస్థితి చక్కబడకపోతే.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రానికి గడ్డుకాలం తప్పకపోవచ్చని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రత్యేక చైనా వంటి దేశాల నుంచి వచ్చే ముడిసరుకులపై ఆధారపడి నడిచే సంస్థలు దాదాపు మూతపడే స్థాయికి చేరుకొన్నాయి. అసలే ఆర్థిక మాంద్యం యావత్ దేశాన్ని కుదిపేస్తున్న కాలంలో కరోనా వైరస్ మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతోంది. పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితికి రావడంతో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల ఆదాయానికి కోతపడుతోంది. దీంతో పరిశ్రమలు ఆదాయ పన్ను చెల్లించలేని దుస్థితిని ఎదుర్కోవచ్చని విశే్లషకుల అభిప్రాయం. గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం ఐదు శాతంగానే నమోదౌతున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ఆరు నుంచి ఆరున్నర శాతం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్‌లో అంచనా వేశారు. ఆర్‌బీఐ సైతం దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేసింది. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నది నిజం. మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తోంది. బీపీసీఎల్‌లోని 52 శాతం వాటాలను అమ్మేయాలని నిర్ణయించిన కేంద్రం బిడ్‌లను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా వైరస్ కారణంగా ఈ అమ్మకం వ్యవహారం జాప్యం జరిగినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర క్రమంగా పడిపోతోంది. ఇది కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. గత వారం రోజుల వ్యవధిలోనే 20 శాతం (35 డాలర్లు) పతనమైన బ్యారెల్ ధర మరింతగా పడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఒక రకంగా ముడిచమురు ధర తగ్గితే మార్కెట్‌కు ఊతం లభిస్తుందనేది వాస్తవం అయినప్పటికీ ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకొంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదని స్పష్టవౌతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాంద్యం పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి, ద్రవ్యలోటును తగ్గించడానికి కేంద్రం చేపడుతున్న చర్యల్లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఒకటి. మొత్తమీద 65వేల కోట్ల రూపాయిలు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సేకరించాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొంది. అయితే, ఇంతవరకు 35వేల కోట్ల రూపాయిలు మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పుల్లేకపోవచ్చని, 15 వేల నుంచి 20 వేల కోట్ల రూపాయిల లోటు తప్పదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో పెద్ద సంస్థ ఎన్‌టీపీసీలో వాటాలను కూడా అమ్మడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను తట్టుకోవడానికి ఈ చర్య తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీనినిబట్టి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నదని, బడ్జెట్ అంచనాలు, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని నిర్దారణ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లు కూడా తగ్గడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (ఈనెల 31వ తేదీ) ఆదాయ పన్ను వసూళ్లు 11.70 లక్షల కోట్ల రూపాయిలుగా కేంద్రం అంచనా వేసింది. అయితే, జనవరి 31వ తేదీ నాటికి ఈ మొత్తం 7.52 లక్షల కోట్లు మాత్రమే. అంటే.. రెండు నెలల్లో మిగతా మొత్తం వసూలు కావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే దెబ్బతిన్న కారణంగా పన్నుల వసూళ్లు ఆశించనంతగా జరగకపోవచ్చు. ఈ అంశాలన్నీ క్రోడీకరించి చూస్తే రాబోయే కాలంలో ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పదని స్పష్టవౌతోంది.