బిజినెస్
గూడ్స్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేంది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో మానవాళి జీవన మనుగడ పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన చర్చల నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుకుండా ఉండేందుకు లాక్‌డౌన్ నిబంధనలను కొంత వెసులుబాటు కల్పిస్తూ రవాణా రంగానికి అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో గూడ్స్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అన్నిరకాల పార్శిల్ వాహనాలకు అనుమతిస్తూ డీజీపీ దామోదర గౌతం సవాంగ్ ఆదేశాలిచ్చారు. దీంతో పాసులతో పనిలేకుండా ఖాళీగా అయినా వెళ్లే అవకాశం కల్పించారు. అయితే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు మాత్రం వీల్లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో రవాణా సడలింపులకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. అన్నిరకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వడంతో లారీలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్ చేసుకుంటున్నాయి. దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి.
డీజీపీ ఆదేశాలు
పాసుల అనుమానాలపై డీజీపీ గౌతం సవాంగ్ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్, రేడియో మెసేజ్ పంపారు. అన్నిరకాల గూడ్స్ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటప్పుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండు చేయవద్దని ఆదేశించారు. ఏ రకమైన గూడ్స్ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని ఆదేశించారు.