బిజినెస్

రికార్డు స్థాయిలో 2,919 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా వైరస్ గురువారం స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ సూచీలు దారుణంగా పడిపోయాయి. కరోనా ప్రభావం తీవ్రమవుతున్న కొద్దీ బుల్ రన్‌కు దాదాపు బ్రేక్ పడుతూ, మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. సెన్సెక్స్ గత 23 నెలల కాలంలో ఎన్నడూ లేని రీతిలో 2,919.26 పాయింట్లు పతనంకాగా, నిఫ్టీ 868.25 పాయింట్లు పడిపోయింది. కేవలం ఒక్క రోజులోనే మదుపరులు సుమారు రూ.11.42 లక్షల కోట్లు నష్టపోయారంటే, బేర్ దెబ్బ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మున్ముందు సరైన చర్యలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నేపథ్యంలో, గురువారం మార్కెట్లు లావాదేవీలు ప్రారంభమైన మరుక్షణం నుంచే నష్టాల్లోకి జారుకున్నాయి. అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో ఏ దశలోనూ కోలుకోలేదు. సూచీల పతనం మదుపరులను, స్టాక్ బ్రోకర్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రేడింగ్ ఎప్పుడు ముగుస్తుందా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమవుతున్నాయి. భారత్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయనడానికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీల పతనమే నిదర్శనం.
*
న్యూఢిల్లీ, మార్చి 12: స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ప్రాణాంతకమయిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో మదుపరులు ఉన్మాద రీతిలో అమ్మకాలు సాగించడంతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం దేశీ య స్టాక్ మార్కెట్లపైనా తీవ్రంగా పడింది. గురువారం ఒక్క సెషన్‌లోనే కొన్ని లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయిపోయింది. బొం బాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ గతం లో ఎన్నడూ లేని రీతిలో గురువారం ఒక్క సెషన్‌లోనే ఏకంగా 2,919 పాయింట్లు కోల్పోయిం ది. ఇంట్రా-డేలో ఒక దశలో 3,204.30 పాయింట్లు పడిపోయిన ఈ సూచీ తరువాత కొద్దిగా కోలుకొని చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 2,919.26 పాయింట్ల (8.18 శాతం) దిగువన 32,778.14 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 868.25 పాయిం ట్లు (8.30 శాతం) దిగజారి 9,590.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ప్యాక్‌లోని అన్ని సంస్థల షేర్లూ గురువారం నష్టపోయాయి. ఎస్‌బీఐ అత్యధికంగా నష్టపోయింది. ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనాను ప్రపంచ వ్యాప్త వ్యాధిగా అభివర్ణించడంతో పాటు ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తగిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం భయం పుట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక ‘మహమ్మారి’గా ప్రకటించడమే ఈ భారీ పతనానికి నాంది పలికిందని చెప్పొచ్చు.
*
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే 30 రోజుల పాటు బ్రిటన్ మిన హా యూరప్ దేశాల నుం చి అమెరికాలోకి ఎవరూ ప్రవేశించకుండా నిషేధం విధించారు.
* ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ప్రజల పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నాయని, దీంతో ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయని విశే్లషకులు పేర్కొన్నారు.
* ప్రపంచ స్టాక్ మార్కెట్ల బాటలో భారత స్టాక్ మార్కెట్లు గురువారం గణనీయమయిన దిగువ స్థాయిల వద్ద ప్రారంభమయ్యాయి.
* ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం గురించి మదుపరులు తీవ్ర ఆందోళనకు గురికావడం వల్ల మార్కెట్లు పడిపోయాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
* గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల జోరుకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం, రూపాయి విలువ దిగజారడం అనిశ్చితిని పెంచిందని వ్యాపారులు పేర్కొన్నారు.
* గురువారం ఇంట్రా-డేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 49 పైసలు తగ్గి, 74.17 వద్దకు చేరింది.
శ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 5.50 శాతం, ఒక బారెల్‌కు 33.82 డాలర్లకు తగ్గింది.
*ఇతర ఆసియా దేశాల మార్కెట్లలో షాంఘై 1.52 శాతం, హాంకాంగ్ 3.66 శాతం, సియోల్ 3.87 శాతం, టోక్యో 4.41 శాతం చొప్పున నష్టపోయాయి.
* యూరప్‌లో తొలి లావాదేవీలలో మార్కెట్లు ఆరు శాతం వరకు
నష్టపోయాయి.