బిజినెస్

ఆగని పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) షేర్ల ధర పతనం కొనసాగుతునే ఉంది. వరుసగా నాలుగో రోజైన గురువారం ఈ షేర్ల ధర సుమారు 8 శాతం పతనమైంది. గత 52 వారాల్లో ఎన్నడూ లేని రీతిలో అటు బీఎస్‌ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలో రిల్ షేర్ ధర 7.87 శాతం తగ్గి, 892.20 రూపాయలకు చేరింది. కొన్ని రోజులుగా రిల్ వాటాల అమ్మకం జోరు పెరిగింది. దీనితో కంపెనీ మార్కెట్ విలువ కూడా వేగంగా పతనం అవుతున్నది. ఈ వారం మొత్తం మీద ఇప్పటి వరకూ ఈ కంపెనీ షర్ ధర 19.5 శాతం తగ్గింది. బుధవారం రిల్‌ను వెనక్కు నెట్టిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశంలో అత్యంత మార్కెట్ విలువగల కంపెనీగా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పతనం నుంచి కోలుకొని, మళ్లీ పెరుగుతున్నప్పటికీ, రిల్ షేర్ ధర పతనం మాత్రం ఆగలేదు. గత ఏడాది నవంబర్‌లో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రిల్ మార్కెట్ విలువ ఇప్పుడు 5,83,212.61 కోట్లకు పడిపోయింది.