బిజినెస్

మార్కెట్లకు సోకిన కరోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: కరోనా వైరస్ మనుషులనేకాదు.. భారత్‌సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల స్టాక్ మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. మొత్తం ఆర్థిక వ్యవస్థలనే తల్లకిందులు చేస్తున్నది. భారత స్టాక్ మార్కెట్లకు ఈవారం కరోనా వైరస్ దెబ్బ తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు షేర్ల ధరలు భారీగా పతనం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. హోలీ కారణంగా ఒక రోజు మార్కెట్లకు సెలవుకాగా, నాలుగు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యమయ్యాయి. తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగింది. ఈవారం స్టాక్ మార్కెట్లు మొదటి రోజైన సోమవారం నుంచే సమస్యలను ఎదుర్కొన్నాయ. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ ఒకానొక దశలో 2,467 పాయింట్లు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నప్పటికీ అనంతరం స్వల్పంగా కోలుకుని 1,941.67 పాయింట్లు నష్టపోయి 35,634.95 వద్ద ముగిసింది. గత 13 నెలల్లో మా ర్కెట్ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఏర్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా 538 పాయింట్లు నష్టపోయి 10,451.45 వద్ద ముగిసింది.
హోలీ కారణంగా మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా, బుధవారం మార్కెట్లు కొంత మేర ఊపిరి పీల్చుకున్నాయ. తీవ్రమైన ప్రతికూల సూచీలతో ప్రపంచ మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, సెనె్సక్స్ 62.45 పాయింట్ల (0.18 శాతం) ఎగువన 35,697.40 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 6.95 పాయింట్ల (0.07 శాతం) ఎగువన 10,458.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం స్టాక్ మార్కెట్లకు చీకటి రోజుగా పేర్కోవాలి. సెన్సెక్స్ సూచీలు 2,919.26 పాయింట్లు (8.18 శాతం) దిగువన 32,778.14 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 868.25 పాయింట్లు (8.30 శాతం) దిగజారి 9,590.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎవరూ ఊహించని పరిణామంతో మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయ. మదుపరులు ఏకంగా 11,27,160.65 కోట్ల రూపాయలు నష్టపోయారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 1,25,86,398.07 కోట్ల రూపాయలు పడిపోయింది. బుధవారం లావాదేవీలు ముగిసే సమయానికి 1,37,13,558.72 కోట్ల రూపాయలుగా ఈ విలువ భారీ పతనానికి గురైంది. దీనితోపాటు 2,265 కంపెనీలు నష్టాలను చవిచూడగా, కేవలం 201 కంపెనీలు మాత్రమే లాభాలు ఆర్జించాయ.
అయతే, చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ 1,325.34 పాయింట్లు లాభపడి, 34,103.48 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 365.05 పాయింట్లు మెరుగుపడడంతో 9,955.20 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కొంత వరకూ సానుకూలంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పటికీ, ఈవారం మొత్తం మీద లావాదేవీలను పరిశీలిస్తే మాత్రం భారీ నష్టాలే కనిపిస్తాయ. సెన్సెక్స్ ఈవారం 3,473.14 పాయంట్లు పతనం కావడం మార్కెట్ల దుస్థితిని కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తున్నది.