బిజినెస్

మొబైల్ ఫోన్లకు జీఎస్‌టీ పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ విడిభాగాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పెరగనుంది. ఫలితంగా మొబైల్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్ స్పేర్ పార్ట్స్‌పై పన్నును 12 నుండి 18 శాతానికి పెంచాలని తీర్మానించింది. అదే విధంగా యంత్రాలు లేదా మనుషులు తయారు చేసే అగ్గిపుల్లలపై విధించే పన్నును 12 శాతానికి హేతుబద్ధం చేసింది. విమానాల ఎంఆర్‌ఓ సేవలపై విధిస్తున్న పన్నును 18 శాతం నుండి ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించింది. చిన్న, మధ్యతరహా వ్యాపారస్తుల వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించి పలు వెసులుబాటులు, రాయితీలు ఇస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పాదరక్షలు, ఎరువులు, మనుషులు తయారు చేసే నారలపై విధించే జీఎస్‌టీకి సంబంధించిన నిర్ణయాలను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. జీఎస్‌టీ పన్నుల్లో చేసిన మార్పులన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తాయని కౌన్సిల్ తీర్మానించింది. ఆలస్యంగా చెల్లించే జీఎస్‌టీపై వడ్డీని ఇకపై జూలై ఒకటో తేదీ నుండి వసూలు చేయాలని సమావేశం నిర్ణయించింది. జీఎస్‌టీఆర్-9సీ ఫామ్‌ను దాఖలు చేయడానికి తుది గడువును సడలించడం ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులకు కొంత ఊరట కలిగించింది. వార్షిక టర్నోవర్ ఐదు కోట్ల రూపాయలు లేదా అంత కంటే తక్కువ ఉండే వ్యాపార సంస్థల వార్షిక రిటర్నులు దాఖలు తేదీని, 2019 ఆర్థిక సంవత్సరం సవరణ ప్రకటనను దాఖలు చేసే తేదీని ఈ ఏడాది జూలై 30 వరకూ పొడిగించింది. రెండు కోట్ల రూపాయలు లేదా అంతకంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలు 2018-2019 వార్షిక రిటర్నులపై లేట్ ఫీని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం సెస్సు కింద ఇంత వరకూ 78,000 కోట్లు వసూలు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించవలసిన మొత్తం నష్టపరిహారం సెస్సు దాదాపు 1.2 లక్షల కోట్లని ఆమె వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఈ ఏడాది జూలై నాటికి సమర్థమైన జీఎస్‌టీఎన్ విధానాన్ని అమలులోకి తెస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ సంస్థ అధ్యక్షుడు నందన్ నీలకెని తదుపరి రెండు జీఎస్‌టీ సమావేశాలకు హాజరై, సాంకేతికపరమైన అంశాల గురించి సమాఖ్య సభ్యులకు వివరిస్తారని ఆమె వివరించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి జీఎస్‌టీఐటీ వ్యవస్థ సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకుంటామని నందన్ ఇది వరకే ప్రకటించడం తెలిసిందే. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, సులభతర వ్యాపారం, లోయర్ కంప్లయన్స్ బర్డన్ తదితర ఆంశాలలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం, లోపాల తొలగింపు గురించి శనివారం నాటి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో లోతుగా చర్చించారు.
*చిత్రం...జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్