బిజినెస్

కరోనా దెబ్బకు కోళ్ల పరిశ్రమ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) మార్చి 15 : ప్రపంచ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా వణికిస్తోంది. ఈ వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోందని, దానిని నివారించడానికి దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికల సైతం ఆరు వారాలపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. కోడి మాంసం ద్వారానే ఇది వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలతో కోడిమాంసం తినడం 80శాతం మంది ప్రజలు మానివేశారు. దీని వలన చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. కేజీ చికెన్ రూ.70 నుండి వందలోపే అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ చికెన్ వలన వ్యాప్తి చెందుతుందనే విషయంలో నిజం ఉందో లేదో తెలియదు కానీ కోళ్ల పరిశ్రమ మాత్రం కోలుకోలేని నష్టానికి గురౌతుంది. చికెన్ షాపు వాళ్లు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలు అనేకం ఇవి కోళ్ల నుండి వ్యాప్తి చెందదనేది స్పష్టంగా చెపుతున్నా ప్రజలు మాత్రం చికెన్, ఇతర మాంసాహార సబంధమైన వాటికి దూరంగా ఉంటున్నారు. గాంధీనగర్‌లోని ఓ చికెన్ షాపు యజమాని సుబ్బారావు ఈ విలేఖరితో మాట్లాడుతూ తన వద్ద ఆదివారం వస్తే ఆరుగురు పనిచేసేవారని, సుమారు రూ.50వేల వరకు విక్రయాలు జరిగేవని చెప్పారు. ప్రస్తుతం పనివారితో అవసరం రావడం లేదని, విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయని వాపోయారు. ఆదివారం కూడా రూ.5వేలకు మించి అమ్మలేకపోతున్నామని, ఇతర రోజులలో షాపును కూడా తీయడం లేదని తెలిపారు. కోళ్లఫారాల దగ్గర నుండి గతంలో కేజీ లైవ్ కోడి ధర రూ.70 నుండి 80దాకా ఉండేదని, చికెన్ ధర రూ.180ల పైనే ఉండేదని చెప్పారు. ప్రస్తుతం కోళ్ల ఫారాలలో లైవ్ కోడి ధర రూ.30నుంచి రూ.40ల లోపు అమ్ముతున్నారని తెలిపారు. దీనివలన ఒక్కొక్క కోడికి కోళ్లఫారం యజమానులకు రూ.50ల నష్టం వాటిల్లుతోందని తెలియజేశారు. దీనివలన ఫారాలలోని కోళ్లవరకే విక్రయాలు సాగిస్తున్నారే తప్ప కొత్తగా కోడి పిల్లలను పెంచడానికి సాహసించడం లేదని వారు తెలిపారు. కోళ్ల ఫారాలలో పనిచేసే వారి సంఖ్య కూడా యజమానులు భారీగా తగ్గించివేశారని చెప్పారు. కరోనా వైరస్ అనేది కోళ్ల నుండి వ్యాప్తి చెందుతుందనే అపోహలను నివృత్తి చేసి ప్రజలలో ఉన్న భయాందోళనను పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేనిపక్షంలో కోళ్ల పరిశ్రమపై దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా కోళ్ల నుండి కరోనా వ్యాప్తి చెందుతుందనుకుంటే ప్రభుత్వాలు కోడిమాంసం విక్రయాలను ఎందుకు కొనసాగిస్తారని, ఎపుడో ఆంక్షలు విధించేవారని, ఈవిషయం ప్రజలు తెలుసుకోవాలని సుబ్బారావు అన్నారు. 2 నెలలుగా షాపు అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితి యథాస్థితికి ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నామని నిరాశని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొన్నిరోజులు కొనసాగితే కోడిమాంసం దొరకడమే కష్టం అవుతుందని, ధర కూడా రూ.300ల పైనే ఉండే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులలో చికెన్ తినవచ్చా లేదా అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.