బిజినెస్

డ్రోన్ల తయారీలో ఆధునిక టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: అంతర్జాతీయంగా మానవ రహిత విమానాల (డ్రోన్) తయారీలో అగ్రగామిగా ఉన్న డీజేఐ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్ షో కార్యక్రమానికి మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ మ్యు కార్యదర్శి జయేష్ రంజన్, డీజేఐ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వింగ్స్ ఇండియా-2020 సదస్సు, అంతర్జాతీయ ఎయిర్ షో ప్రదర్శన వేదికపై ఈ మేరకు ఎంఓయూ కుదిరింది. అంతర్జాతీయంగా డ్రోన్ల తయారీలో డీజేఐ సంస్థ ముందంజలో ఉంది. ప్రపంచంలోని
డ్రోన్ల మార్కెట్లో డీజేఐ సంస్థ వాటా 70 శాతం వరకు ఉంది. డ్రోన్లలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. 2025 నాటికి అంతర్జాతీయంగా డ్రోన్ల మార్కెట్ 130 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నారు. డ్రోన్ల రంగంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని, ఇక్కడ మార్కెటింగ్‌ను విస్తృతం చేయాలని, ఉద్యోగావకాశాలను కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ, మారుతి డ్రోన్స్ అనే హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్ల స్టార్టప్‌ను కూడా ఇక్కడ ప్రారంభించారు. డీజేఐ సంస్థ డ్రోన్ల పైలట్ ట్రైనింగ్‌ను ఇస్తుంది. తమ సంస్థ తాజాగా రూపొందించే అధునాతన టెక్నాలజీని డీజేఐ సంస్థ అందిస్తుంది.

*చిత్రం... మానవ రహిత విమానాల తయారీలో అగ్రగామి సంస్థ డీజేఐతో శనివారం ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్