S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/02/2020 - 01:13

విజయవాడ: మార్చి మాసం.. అందునా ఆర్థిక సంవత్సరాంతం. అన్నింటికీ మించి ఎల్‌ఐసీ ఏజెంట్లు, డీవోలకు ప్రాణాంతకం. ఇంకేముంటుంది! ఏడాదిలో 11 నెలలు జరగని ఆర్థిక లావాదేవీలన్నీ ఒక్క మార్చి మాసంలోనే జరుగుతుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఊహించని రీతిలో 30రోజుల్లో 12రోజులు సెలవులు. ఒకవేళ ఏటీఎంలున్నా ఒక్కసారి వాటిల్లో డబ్బులేని స్థితి.

03/01/2020 - 05:24

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఓడ రేవుల్లో ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాల కల్పన జరగాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశంలోనే ప్రముఖ ఓడరేవుల అధిపతులతో శనివారం ఇక్కడ ఏర్పాటైన ‘చింతన్ బైటక్’లో ఉప రాష్ట్రపతి ముఖాముఖి అయ్యారు. చైరపర్సన్లు, అడ్మినిస్ట్రేర్లను ఉపరాష్ట్రపతి దిశ నిర్దేశన చేశారు.

03/01/2020 - 05:22

ముంబయి, ఫిబ్రవరి 29: ఈవారం స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు తప్పలేదు. సోమవారం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి చివరి రోజైన శుక్రవారం వరకూ మార్కెట్లు కోలుకోలేకపోయాయి. కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే స్టాక్ మార్కెట్లపైన కూడా తీవ్రంగా కనిపించింది. చైనా నుంచి ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందిన నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

03/01/2020 - 04:56

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 29: నగరంలో చేపట్టిన అనధికార భవనాల క్రమబద్ధీకరణ స్కీమ్ శనివారంతో ముగిసింది. ఈమేరకు గత ఏడాది ప్రారంభమైన ఈస్కీమ్‌లో గుర్తించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరించేందుకు గాను ప్రారంభించిన బీపీఎస్ శనివారం ముగియడంతో శుక్ర, శనివారాలలో ప్రత్యేక బీపీఎస్ మేళా నిర్వహించి అపరిష్కృతంగా ఉన్న పలు దరఖాస్తులను పరిష్కరించారు.

03/01/2020 - 04:18

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతోంది. మార్చి నుంచి విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఈ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలికంగా విద్యుత్ చార్జీల పెంపు అంశం వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోపక్క విద్యుత్ సంస్థలు తమ నివేదికను అందించడానికి కొంత గడువు కావాలని ఈఆర్‌కి లేఖ రాశాయి.

03/01/2020 - 03:50

అమరావతి, ఫిబ్రవరి 29: రాష్ట్రంలో పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ భేటీ అయ్యారు.

02/28/2020 - 04:04

న్యూఢిల్లీ: భారత బులియన్ మార్కెట్లో బంగారం ధర గురువారం పెరిగింది. 10 గ్రాముల బంగారం 78 రూపాయలు పెరిగి, 43,513 రూపాయలకు చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో, ఎక్కువ మంది మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా బంగారం వైపు దృష్టి సారించడమే ఈ పెరుగులకు ప్రధాన కారణం. కిలో వెండి ధర 35 రూపాయలు పెరిగి, 48,130 రూపాయలకు చేరింది.

02/28/2020 - 03:33

హైదరాబాద్, ఫిబ్రవరి 27: దేశ, రాష్ట్రాల్లో బొగ్గు అవసరాల కోసం సింగరేణి గనుల నుంచి 2025 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీని కోసం ఆస్ట్రేలియా నుంచి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను దిగుమతిని చేసుకుంటున్నామని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ గుర్తు చేశారు.

02/28/2020 - 03:14

ఖమ్మం, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా మార్చి 31లోగా కార్గో సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని అభివృద్ది బాటలోకి తీసుకువచ్చేందుకు కార్గో సేవలు ప్రారంభిస్తున్నామని, ఒకేసారి వంద కార్గో బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

02/28/2020 - 01:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను కేంద్రం క్రమంగా చలామణి నుంచి తొలగించబోతోందంటూ వచ్చిన కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. ఈ నోట్ల చెలామణిని నిలిపివేయాలని బ్యాంకులకు ఎలాంటి ఆదేశం జారీ చేయలేదని గురువారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల సమావేశంలో స్పష్టం చేశారు.

Pages