బిజినెస్

మద్యం దుకాణాలు కిటకిట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోతాయంటూ ఉదయం నుంచే ఒక్కసారిగా ప్రచారం గుప్పుమంది. దీనికితోడు కొందరు మంత్రులు ఈ ప్రచారం కరెక్టేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ల వరకు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బ్లాక్ టిక్కెట్ల అమ్మకందారులు సైతం మద్యం కోసం క్యూకట్టారు. వివిధ పక్షాల నేతలు, ముఖ్యంగా పోటీకి సిద్ధపడుతున్న అభ్యర్థులు ఇంకా నామినేషన్ దాఖలు చేయకపోయినా ముందుజాగ్రత్తతో తమ పలుకుబడిని ఉపయోగించి భారీగా మద్యాన్ని దొడ్డిదారిన తమ రహస్య స్థావరాలకు తరలించారని సమాచారం. నిత్య మందుబాబులు కూడా వడ్డీకి అప్పులు చేసి మరీ సాధ్యమైనంత మేర తమ ఇళ్లలో నిల్వ చేసుకోటానికి తాపత్రయపడ్డారు. అయితే 12 నుంచి మద్యం అమ్మకాల నిలిపివేతపై సోమవారం రాత్రి వరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఎక్సైజ్, ప్రొషిబిషన్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మద్యంతో ప్రమేయం లేకుండా ఎన్నికలు జరపాలన్న కృతనిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారు. ఇక ఏక్షణన్నైనా మద్యం అమ్మకాల బంద్‌పై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అయితే మన రాష్ట్ర సరిహద్దులుగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని జిల్లాలు ఉన్నాయి. దీనివల్ల మద్యం అక్రమ రవాణాను నిలువరించడం కష్టతరవౌతోందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.