బిజినెస్

మార్కెట్ హాహాకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కరోనా వైరస్ ప్రకంపనలు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్లను కకావికలం చేస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రత పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి తలెత్తపడంతో ఒక్కసారిగా సోమవారం ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీలు అనూహ్యరీతిలో కుంగిపోయాయి. ఇటీవల కా లంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో సెనె్సక్స్ భారీగా పతనమైంది. ఏకంగా 1,941 పాయింట్లు కోల్పోయి ఇనె్వస్టర్లలో గగ్గోలు పుట్టించింది. అలా గే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 538 పాయింట్లు కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. మరోపక్క అంతర్జాతీయ మాంద్య భయం సర్వత్రా అలుముకుంటోంది. ఒకదశలో సెనె్సక్స్ 2,467 పాయింట్లు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నప్పటికీ అనంతరం స్వల్పంగా కోలుకుని 1,941.67 పాయింట్లు నష్టపోయి 35,624.95 వద్ద ముగిసింది. గత 13 నెలల్లో మా ర్కెట్ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. అలాగే నిఫ్టీ కూడా 538 పాయింట్లు నష్టపోయి 10,451.45 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ హాహాకార పరిస్థితి వల్ల దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నికరంగా 6,84,277.65 కోట్ల రూపాయల మేర ఇనె్వస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కరోజులోనే ఇంత భారీ ఎత్తున సంప ద ఆవిరైపోవడం అనూహ్యమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నేటి లావాదేవీల్లో ఓఎన్‌జీసీ షేర్ విలువ దాదాపు 16 శాతం పతనమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి. ఎస్ బ్యాంక్‌లో 49 శాతం వాటా కొంటామని ఎస్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో దా ని షేర్ల విలువ కూడా ఆరు శాతం పతనమైంది. ఎస్ బ్యాంక్ షేర్లు 30 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు అనివార్యమన్న భయం నేటి లావాదేవీల్లో ఇనె్వస్టర్లలో కనిపించింది. చమురు ధరల పతనం, కరోనా వైరస్ అప్రతిహత వ్యాప్తే దేశీయ మార్కెట్లలో ఆందోళనకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ముడిచమురు ధరలు తగ్గించి, ఉత్పత్తిని పెంచాలన్న సౌదీ అరేబియా నిర్ణయం నేపథ్యంలో ముడిచమురు ధరలు 30 శాతం మేరకు తగ్గిపోయాయి. ఒపెక్ దేశాలతో సౌదీ అరేబియా జరిపిన చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తొలి గల్ఫ్ యుద్ధం తర్వాత ముడిచమురు ధరలు ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి.

*చిత్రం... కళ్ల ముందే మార్కెట్ పతనం. ముంబయిలో గగ్గోలెత్తిన జనం