బిజినెస్

ఎస్ బ్యాంక్ ముడుపుల కేసు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: ఎస్ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థ, ఎస్ బ్యాంక్ సహ సంస్థాపకుడు కుటుంబానికి 600 కోట్ల రూపాయల మేర ముడుపులు చెల్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ తనిఖీలు జరిపింది. మొత్తం ఏడు చోట్ల అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ కపూర్‌తోపాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, ఐదు కంపెనీలపై అభియోగాలు నమోదు చేసింది. రాణాకపూర్‌తోపాటు ఆయన భార్య బిందు, కుమార్తెలు రోషిణి, రాఖే, రాధపై కూడా కేసు నమోదు చేసింది. ఈ ఏడుగురు నిందితులు దేశం ఒదిలి పారిపోకుండా సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా, ఎస్ బ్యాంకుపై విధించిన మారటోరియం శనివారానికి తొలగిపోగలదన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ నియమించిన నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ బ్యాంకులో 49 శాతం వాటా కొనాలన్న ఎస్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో మారటోరియం పరిధి నుంచి ఈ బ్యాంక్ బయటపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎస్ బ్యాంక్‌లో 2.09 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.