బిజినెస్

రికార్డు స్థాయిలో వాల్తేర్ డివిజన్ లోడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 1: అత్యధికంగా సరకు లోడింగ్ సాధించిన ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ తొలిసారిగా రికార్డుకెక్కింది. ఒకేరోజు ఏకంగా 72 గూడ్స్ రైళ్ల ద్వారా అత్యధిక లోడింగ్‌ను సాధించింది. భారతీయ రైల్వేలోనే మరే జోన్‌లో లేనివిధంగా వాల్తేర్ డివిజన్ పరిధిలోనే ఫిబ్రవరి 29వతేదీ ఒక్కరోజులోనే 72గూడ్స్ రైళ్లు (రేక్స్) 3782వ్యాగన్ల ద్వారా సరకు లోడింగ్‌ను నిర్వహించింది. వాల్తేర్ డివిజన్ ట్రాఫిక్ విభాగం ఆది నుంచి తీసుకున్న ప్రత్యేక చర్యలు, నిర్మాణాత్మక ప్రణాళికల ద్వారా ఈ రికార్డు సాధించగలిగినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయంలో 68గూడ్స్ రైళ్ల (రేక్‌లు) ద్వారా లోడింగ్ జరిగింది. 68మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తిచేయాలని రైల్వేబోర్డు ఆదేశించిన నేపధ్యంలో భారతీయ రైల్వేలో మరే జోన్ పరిధిలోనే లేనివిధంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు చెందిన వాల్తేర్ డివిజన్ ఒక్కటే దీనిని అధిగమించి ఒకేరోజు 72గూడ్స్ రైళ్ళ ద్వారా సరకు రవాణాను సాధించి అగ్రగామిగా నిలిచింది. గత నెలాఖరికి మొత్తం సాధించిన లోడింగ్ ద్వారా రికార్డుస్థాయిలో రూ.7222ల కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టగలిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల్లో కూడా ఈవిధమైన రికార్డుకెక్కి భారతీయ రైల్వేలోనే అగ్రగామిగా నిలపడానికి కృషి చేసిన వాల్తేర్ డివిజన్ ట్రాఫిక్ విభాగం, ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులకు డీఆర్‌ఎం చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్ ఆదివారం అభినందనలు తెలియజేశారు. అలాగే అదనంగా మరో 51 సీసీ రేక్‌లు ఒకేరోజు లోడింగ్ సాధించి 165 నుంచి 216గూడ్స్ వ్యాగన్ల సంఖ్యకు చేరుకోగలిగింది. కెకె లైన్‌లో నియంత్రించబడిన వేగంతో నడిచే గూడ్స్ రైళ్ల ద్వారా లక్ష్యాలను అధిగమించడంతోపాటు, సింహాచలం నార్త్ పరిధిలో సాంకేతిక పరమైన సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, అదనంగా విద్యుత్ గూడ్స్‌ల నిర్వహణ, జీ-9 మల్టీ లోకోల ద్వారా లోడింగ్ సాధించామని డివిజన్ అధికారులు చెబుతున్నారు. అన్నింటి కంటే ప్రధానంగా సిగ్నల్ అండ్ టెలికామ్ వైఫల్యాలను నివారించడం ద్వారా కూడా ఇటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి సాధ్యపడిందని పేర్కొన్నారు.