బిజినెస్

పౌల్ట్రీ రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 7: కరోనా వైరస్‌తో కోళ్ల పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. కోవిడ్-19వైరస్ కారణంగా చికెన్ ప్రియులు చాలా మటుకు వెనుకంజ వేయడంతో చికెన్ సెంటర్లు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే చికెన్ సెంటర్లు కరోనా వైరస్ కారణంగా రద్దీ తగ్గిపోయి అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా భయంతో పౌల్ట్రీ పరిశ్రమ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లను కొనుగోలు చేసేందుకు ఇపుడున్న పరిస్థితులలో పెద్దగా ముందుకు రాకపోవడం..బ్యాంకుల్లో చేసిన అప్పులు కట్టలేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు కృషి చేయాలని స్థానిక పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. కోళ్ల ధరలు రోజురోజుకు తగ్గిపోవడం, తెచ్చుకున్న కోళ్లు అమ్ముడుపోక ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ ధరకు కోళ్లను ఇచ్చేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. షాద్‌నగర్ డివిజన్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో ఎక్కువగా రైతులు ఎక్కువగా ఫౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. ఈ పౌల్ట్రీ పరిశ్రమల నుండి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు గుడ్లు, కోళ్లను ఎగుమతులు చేస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో పౌల్ట్రీ రైతులు నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు నెలల క్రితం కోడి రూ.150కి పౌల్ట్ఫ్రీం వద్ద విక్రయించే వారు..ఇపుడు ఊహించని రీతిలో ధర తగ్గింది. కోడి గుడ్ల ధరలు సైతం తగ్గడంతో పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు. జనవరిలో పౌల్ట్ఫ్రిం వద్ద రైతుల నుంచి ఒక్కొక్క గుడ్డు రూ.4పైగా కొనుగోలు చేసే వారు..ప్రస్తుతం రెండున్నర నుండి మూడు రూపాయలకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు చికెన్..మరోవైపుకోడి గుడ్ల విక్రయాలు తగ్గిపోవడంతో ఏం చేయాలో తెలియక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.