బిజినెస్

తప్పని ‘కరోనా’ ప్రభావం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై ఈవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చితిలోనే లావాదేవీలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 4,187.52 పాయింట్లు (12.27 శాతం) పతనమైతే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1,209.73 పాయింట్లు (12.15 శాతం) నష్టపోయింది. వరుసగా నాలుగు రోజుల నష్టాలకు తెరదించుతూ, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ, అదే రకమైన సానుకూల ధోరణులు ఈవారం కూడా కొనసాగుతాయని అనుకోవడానికి వీల్లేదన్నది వాస్తవం. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌ను కూడా ఈ సమస్యే వెంటాడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లను ఆదుకోవడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వ తీసుకోబోయే నిర్ణయాలు, ఆదుకోవడానికి ప్రకటించే రాయితీలపైనే మార్కెట్ల మార్కెట్ల భవిష్యత్తు ఆధారడి ఉంటుంది. గత వారం ఈక్విటీ షేర్ సూచీల పతనంతోపాటు ట్రేడింగ్ జరిగిన తీరు కూడా భవిష్యత్తుపై ఎలాంటి అంచనాలు వేయలేని పరిస్థితులను కల్పిస్తున్నది. 2008 అక్టోబర్ తర్వాత ఒక వారంలో స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. వచ్చే వారం ట్రేడింగ్ కొంత మెరుగ్గానే ఉంటుందని విశే్లషకులు ఆశాభావంతో ఉన్నప్పటికీ, తీవ్రమైన ఒడిదుడుకులు మార్కెట్లను ఏ దిశగా మళ్లిస్తాయో చెప్పడం కష్టం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, మార్కెట్లకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత, గత వారం చివరి రోజు, శుక్రవారం సెనె్సక్స్ 1,627.73 పాయింట్లు (5.75 శాతం) లాభాలను ఆర్జించిన విషయం తెలిసిందే. కేంద్రం ఉద్దీపన పథకాలను ప్రకటిస్తుందన్న ఆశ మదుపరులను కొనుగోళ్లవైపు ఆకర్షించాయి. అయితే, తీసుకోబోయే చర్యలపై త్వరలో స్పష్టత రాకపోతే, పెట్టుబడిదారులు తిరిగి రక్షణాత్మక విధానాలను అనుసరించే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే, మార్కెట్లు తిరిగి నష్టాల్లోకి జారుకోవడం ఖాయం. అంతర్జాతీయ సూచీలు కూడా ప్రతికూల ధోరణుల్లోనే కొనసాగడం కూడా భారత్‌ను సమస్యల్లోకి నెడుతున్నది. గతంలో ఎన్నడూలేని రీతిలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోతే, ఈవారం కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగనుంది.