అంతర్జాతీయం

ఇది ఆ దేవుడు విధించిన శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే: ‘అమెరికా, యూరప్ దేశాలకు కరోనా వైరస్ భగవంతుడు విధించిన శిక్ష’ అని జింబాబ్వే రక్షణ మంత్రి ఒప్పా ముచింగురి నిప్పులు చెరిగారు. తమ దేశంలోని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు, పాలక పాలనలోని సభ్యులపై ఆంక్షలు విధించినందుకు కరోనా మహామ్మారిని అమెరికా, యూరప్ దేశాలకు భగవంతుడు శిక్షగా విధించారని ఆయన ఆదివారం పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే 150.000 మందికి సోకినట్లు గుర్తించగా, వీరిలో సుమారు 6 వేల మంది మృత్యువాత పడ్డారు. తొలుత గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో కరోనా వ్యాధిని గుర్తించడం జరిగింది. ఇదిలాఉండగా శనివారం చిన్హొయిలో జరిగిన ఓ భారీ ర్యాలీనుద్ధేశించి రక్షణ మంత్రి ముచింగురి ప్రసంగిస్తూ అమెరికా, యూరప్ దేశాలపై చిటపటలాడారు. తాము బ్రహ్మండంగా ర్యాలీని నిర్వహించుకుంటే ఆ దేశాల ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు.