S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/15/2019 - 06:04

బ్రెసిలియా: పెట్టుబడులకు, వ్యాపారానుకూల పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐదు బ్రిక్స్ దేశాల వ్యాపారవేత్తలను ఉద్దేశించి గురువారం ఇక్కడ మాట్లాడిన మోదీ ‘ భారత్‌లో హద్దులేని అవకాశాలున్నాయి.. అనంతమైన పెట్టుబడులకు వీలుంది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరలిరండి..’ అని పిలుపునిచ్చారు.

11/15/2019 - 05:14

బ్రెసిలియా, నవంబర్ 14: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మరింత సన్నిహితంగా ముందుకు సాగాలని.. అలాగే ఇరు దేశాల సంబంధాలకు కొత్త శక్తిని, యుక్తిని అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

11/15/2019 - 05:12

బ్రెసిలియా, నవంబర్ 14: వచ్చే ఏడాది మేలో జరగనున్న విక్టరీ డే ఉత్సవాలకు రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వీరిద్దరూ గురువారం నాడిక్కడ సమావేశమై పరస్పర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

11/15/2019 - 05:05

ఇస్లామాబాద్, నవంబర్ 14: భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్ష విషయంలో భారత్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకునే ప్రసక్తి లేదని పాకిస్తాన్ తెగేసి చెప్పింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు తమ రాజ్యాంగం ప్రకారమే ఉంటుందని గురువారం నాడిక్కడ పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు.

11/14/2019 - 23:39

బ్రసిలియా, నవంబర్ 14: అభివృద్ధి, శాంతి, సంపదలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రభూతం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల మేర అపారమైన నష్టం వాటిల్లుతోందని గురువారం ఇక్కడ జరిగిన 11వ బ్రిక్స్ దేశాల సదస్సులో స్పష్టం చేశారు.

11/13/2019 - 22:42

*చిత్రం...బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రసేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానిస్తున్న బ్రెజిల్ అధికారులు

11/13/2019 - 01:58

పారిస్, నవంబర్ 12: అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక న్యుమోనియా వల్ల ప్రతి 39 సెకన్లకు ఓ వ్యక్తి బలవుతున్నాడని అంతర్జాతీయ ఆరోగ్య శిశు పరిరక్షణ ఏజన్సీలు హెచ్చరించాయి. న్యుమోనియా గురించి ఇటీవలి కాలం లో ఎలాంటి ప్రచారం లేకపోయినా కూడా ఇదో సైలెంట్ కిల్లర్‌గా పరిణమిస్తోందని వ్యాఖ్యానించారు.

11/12/2019 - 04:02

బీజింగ్, నవంబర్ 11: నిన్నమొన్నటి వరకూ అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు రగులుకుంటే తాజాగా టిబెట్ వ్యవహారం తీవ్ర సమస్యగా మారబోతోంది. ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని టిబెట్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రమేయం లేకుండా చేయడానికి మరోపక్క ట్రంప్ ప్రభుత్వమూ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టింది.

11/11/2019 - 00:38

*చిత్రం...సిక్కుల మత గురువు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భగా పాకిస్తాన్ కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహెబ్‌ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన దృశ్యం.

11/10/2019 - 05:14

*చిత్రాలు.. కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, గురుద్వార సందర్శనకు తరలివచ్చిన సిక్కు యాత్రీకులు

Pages