• వాషింగ్టన్ : ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో కాశ్మీర్ అం

  • వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గనిస్తాన్ నుంచి తమ దళాలు పూర్తిగా వైదొలగే ప్రసక్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/08/2019 - 23:28

న్యూఢిల్లీ, ఆగస్టు 8: సంఝోతా ఎక్స్‌ప్రెస్ రైలుకు పాకిస్తాన్ బ్రేక్ వేసింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్డికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ గురువారం వాఘా సరిహద్దు వద్ద సంఝోతా ఎక్స్‌ప్రెన్‌ను అడ్డుకొని, వెనక్కు పంపింది. భద్రతాపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.

08/08/2019 - 22:05

మక్కా (సౌదీ అరేబియా)లోని కాబాను దర్శించడానికి పోటెత్తిన వేలాది మంది ముస్లింలు. వార్షిక హజ్ యాత్రకు ఈ ఏడాది కూడా లక్షలాది మంది తరలివచ్చారు.

08/08/2019 - 22:01

స్వెగిన్ (మైన్మార్), ఆగస్టు 8: భారీ వర్షాలు, వరదలతో మైన్మార్ అతలాకుతలమయింది. లక్షలాది మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత స్థలాలకు తరలిస్తున్నారు. స్వెగిన్‌లోని టౌన్‌షిప్ దాదాపుగా మునిగిపోయింది. వరద నీరు పోటెత్తడంతో ఎన్నో ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. సిటియూంగ్ నది పోటెత్తడంతో అనేక గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి.

08/08/2019 - 00:10

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత ప్రభుత్వం కాశ్మీర్ విభజన బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. పంచ సూత్రాల వ్యూహాన్ని ఖరారు చేసింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం తమ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

08/07/2019 - 23:39

హొనోలులూ (పశ్చిమాసియా), ఆగస్టు 7: హవాయ్‌కి సమీపంలోని కిలాయియాలో ఉన్న అగ్ని పర్వత బిలంలో నీటి నిల్వలను శాస్తవ్రేత్తలు కనుగొన్నారు.

08/07/2019 - 23:44

వాషింగ్టన్, ఆగస్టు 7: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగిన (బ్రెగ్జిట్) అనంతరం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని బ్రిటన్ కోరుకుంటోంది. అందువల్ల బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తమ దేశ విదేశాంగ మంత్రిని, విదేశీ వాణిజ్య శాఖ మంత్రిని అమెరికాకు పంపించారు.

08/07/2019 - 23:37

వాషింగ్టన్, ఆగస్టు 7: శాస్తజ్ఞ్రులు తొలిసారి జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా ప్రయోగశాలలో చిన్న పరిమాణంలో గల మానవ కాలేయాలను అభివృద్ధి చేశారు. మనుషుల్లో కాలేయ వ్యాధులు ఎందుకు వస్తాయి, అవి ఎలా తీవ్రమవుతాయి అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆ వ్యాధులను నయం చేయడానికి ఇచ్చే వైద్య చికిత్స, ఔషధాలను పరీక్షించడానికి ఈ చిన్న మానవ కాలేయాలు ఉపయోగపడతాయని శాస్తజ్ఞ్రులు తెలిపారు.

08/07/2019 - 23:37

వాషింగ్టన్, ఆగస్టు 7: జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చుకోవడం భారత దేశ అంతరంగిక వ్యవహారం అని అమెరికాలోని భారత రాయబారి తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించాయి.

08/07/2019 - 23:00

కాబుల్, ఆగస్టు 7: అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జనాలు అధికంగా ఉన్న ప్రాంతంలో శక్తివంతమైన బాంబును పేల్చడంతో 10 మంది పౌరులు, నలుగురు పోలీసులు మరణించారని, ఇంకా 145 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.

08/07/2019 - 22:42

భారత్‌పై దాడికి ఐదెంచల వ్యూహం రాయబారి బహిష్కరణ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు రద్దు
ఐరాసను ఆశ్రయంచాలని నిర్ణయం 14న సంఘీభావ దినోత్సవం

Pages