S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/30/2020 - 04:53

వూహాన్ (చైనా): కరోనా వైరస్ భయం కారణంగా విదేశీ విమానయాన సంస్థలు చైనాకు తమ విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని బుధవారం మొదలుపెట్టాయి. ఈ కొత్త వైరస్ వల్ల చైనాలో మృతుల సంఖ్య 132కు పెరగడంతో పాటు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య సుమారు ఆరు వేలకు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొనడంతో ఆ వైరస్ తమ దేశాలకు విస్తరించకూడదనే ముందు జాగ్రత్తగా ఈ దేశానికి రాకపోకలను నిలిపివేస్తున్నాయి.

01/27/2020 - 06:45

ఇస్లామాబాద్, జనవరి 26: భారత్‌తో సంబంధాలలో ఉద్రిక్తతల కొనసాగింపు సహా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలు 2020 సంవత్సరం అంతా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక, భద్రతా అంశాలపై తీవ్రంగా ఉంటుంది. ఇస్లామాబాద్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐ) ఈ మేరకు ‘పాకిస్తాన్ ఔట్‌లుక్ 2020: పాలిటిక్స్, ఎకానమి అండ్ సెక్యూరిటి’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో ఈ విషయం తెలిపింది.

01/27/2020 - 01:22

వాషింగ్టన్, జనవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2016లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసేందుకు డెమోక్రాటిక్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన తరఫు లాయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్‌తో లావాదేవీలు తదితర అక్రమాల ఆరోపణలపై ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇదంతా రాజకీయ కుట్రగా ఆయన తరఫు లాయర్లు వ్యాఖ్యానించారు.

01/26/2020 - 23:35

బీజింగ్, జనవరి 26: చైనాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న వూహాన్‌లో విద్యార్థులు సహా 250 మంది భారతీయులు చిక్కుకుపోయిన సమస్యను పరిష్కరించేందుకు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు భారత్ ఆదివారం తెలిపింది.

01/24/2020 - 05:42

దావోస్, జనవరి 23: ఒకప్పుడు భారత్‌ను క్రికెట్‌లో చిత్తుచేశామని, ఇప్పుడు ఆర్థికంగానూ ఆ దేశాన్ని వెనక్కు నెట్టేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఇమ్రాన్ విలేఖరులతో మాట్లాడుతూ, తమ దేశంతో పోలిస్తే ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ను అనేక పర్యాయాలు క్రికెట్‌లో ఓడించామని అన్నారు.

01/24/2020 - 05:38

దావోస్, జనవరి 23: ముస్లింలకు సురక్షిత ప్రాంతం భారత్ మాత్రమేనని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం ఇక్కడ నొక్కి చెప్పారు. భిన్న సామాజిక వర్గాలకు నిలయం భారతదేశం అని పియూష్ స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) 2020 సమావేశాల్లో భాగంగా ‘స్ట్రాటజిక్ ఔట్‌లుక్: ఇండియా’ అంశంపై జరిగిన సదస్సులో గోయల్ ప్రసంగించారు.

01/22/2020 - 05:28

ఖట్మాండు: నేపాల్ పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది భారతీయులు ఓ హోటల్‌లో మృతి చెందారు. రాజధాని ఖట్మాండులోని ఓ హోటల్‌లో బసచేసిన టూరిస్టులు చనిపోయారు. పర్యాటకులు బస చేసిన గదిలో హీటర్ నుంచి గ్యాస్ లీకై మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

01/21/2020 - 23:42

దావోస్, జనవరి 21: ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేనంత విస్తృత స్థాయిలో అమెరికా ఆర్థిక వృద్ధిని సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా కలలు సాకారం అవుతున్నాయని, మరింత మెరుగైన స్థితిలో ఇప్పుడు ఉందని తెలిపారు. ప్రపంచ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేసిన ట్రంప్ అమెరికాలో మధ్యతరగతి ప్రజలు ఉన్నంత ఆనందంగా ఎవరూ లేరని అన్నారు.

01/21/2020 - 23:38

ప్యారిస్, జనవరి 21: ప్రకృతిసిద్ధమైన సహజ వనరులు మానవ వినియోగ కారణంగా అపారంగా హరించుకుపోతున్నాయి. మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాలు ఏడాదికి వంద బిలియన్ టన్నులకు మించి సహజ వనరులను వాడేశాయని తాజాగా జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది.

01/21/2020 - 23:37

కొలంబో, జనవరి 21: తమిళ మిలిటెంట్ గ్రూపు (ఎల్‌టీటీఏ)ను అణచివేసే క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో అదృశ్యమైన వారంతా మృతి చెందారని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విస్పష్టమైన ప్రకటన చేశారు. ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను లంక దశాలు 2009లో హతమార్చాయి.

Pages