అంతర్జాతీయం

వారు మృతి చెందారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జనవరి 21: తమిళ మిలిటెంట్ గ్రూపు (ఎల్‌టీటీఏ)ను అణచివేసే క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో అదృశ్యమైన వారంతా మృతి చెందారని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విస్పష్టమైన ప్రకటన చేశారు. ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను లంక దశాలు 2009లో హతమార్చాయి. అంతకు ముందు, అత్యంత తీవ్ర స్థాయిలో జరిగిన అంతర్యుద్ధ సమయంలో కనీం 40,000 మంది తమిళ వేర్పాటు వాదులను శ్రీలంక సైనికులు, భద్రతా దళాలు అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి, హతమార్చారని తమిళ వర్గాలు ఆరోపించాయి. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాయి. యూఎన్ వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో, కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నట్టు 4,000 మంది అదృశ్యం కాలేదని గొటబాయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 20,000 మంది అదృశ్యమయ్యారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా గాలింపు చర్యలు చేపట్టిందని, చివరికి వారంతా మృతి చెందినట్టు నిర్ధారించిందని వివరించారు. అంతర్యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన వారి కుటుంబీకులకు మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని తెలిపారు. ప్రభాకరన్‌ను మట్టుపెట్టి, ఎల్‌టీటీఈ ఆధిపత్యానికి తెరదించిన సమయంలో భద్రతా దళాల అధిపతిగా గొటబాయ సేవలు అందించారు. ఆయన నేతృత్వంలోనే ఎల్‌టీటీఈ ప్రక్షాళన జరిగింది. కనీసం లక్ష మంది మృతి చెందారని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ హనా సింగర్‌కు సమర్పించిన నివేదికలో గొటబాయ పేర్కొన్నారు. నలభై వేల మంది అదృశ్యమయ్యారంటూ తమిళ వర్గాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.