-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో అభిశంసనకు గురయిన మూడో దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నారని అమెరికా ప్రతినిధుల సభ లాంఛనంగా అభియోగాలు చేసింది. దీంతో వచ్చే సంవత్సరం సెనేట్ విచారణ జరుగనుంది. ట్రంప్ తరువాత మూడేళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగుతారా? దిగిపోవాల్సి వస్తుందా? అనేది సెనేట్ విచారణ నిర్ణయిస్తుంది.
ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ నియంత పర్వెజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పునకు సంబంధించిన వివరాలు గురువారం వెలుగు చూశాయి. ఈ తీర్పులో ప్రత్యేక కోర్టు 176పేజీల తీర్పు పాఠంలో చాలా తీవ్రమైన పదజాలానే్న ముషారఫ్‌పై ప్రయోగించింది.
వాషింగ్టన్, డిసెంబర్ 19: భారత్, అమెరికా తమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. రక్షణ, కౌంటర్‌టెర్రరిజం, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ రీజియన్‌ను స్వేచ్ఛాయుతమైన ప్రాంతంగా ఉంచడం కోసం ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన దేశాలతో కలిసి పనిచేయడం వంటి అంశాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో మరణశిక్ష ఖరారయిన పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు శక్తివంతమయిన పాకిస్తాన్ సైన్యం బహిరంగంగానే మద్దతు పలకడంతో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు కానున్న అప్పీలుపై జరిగే విచారణ సందర్భంగా ముషారఫ్‌కు అండగా నిలవాలని నిర్ణయించింది.
న్యూయార్క్: భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక్కడి భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన విద్వేషం అన్నది దేశ సంస్కృతిలోనే లేదని స్పష్టం చేశారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడారు.
ఇస్లామాబాద్, డిసెంబర్ 17: రాజ్యాంగాన్ని వక్రీకరించి తీవ్ర స్థాయి దేశ ద్రోహానికి పాల్పడిన నేరానికిగాను పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ చరిత్రలో ఒక సైనిక పాలకుడికి మరణశిక్ష వేయడం ఇదే మొదటిసారి.
మాడ్రిడ్, డిసెంబర్ 15: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో వాతావరణ మార్పును నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలపై అత్యంత సుదీర్ఘ సమయం పాటు జరిగిన అంతర్జాతీయ సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ఆదివారం ముగిసింది. దాదాపు 200 దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ప్రపంచ కార్బన్ మార్కెట్లపై కీలక నిర్ణయాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు.
లండన్, డిసెంబర్ 15: లండన్‌లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ద్వితీయ స్థానం (రన్నర్ అప్)లో భారత్‌కు చెందిన సుమన్ రావు నిలిచారు.
వాషింగ్టన్/ లండన్: ఈశాన్య భారతదేశంలో పర్యటించేప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, కెనడా, సింగపూర్ సహా అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరించాయి. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు తమ పౌరులకు ఈ హెచ్చరికలు జారీ చేశాయి.
మాడ్రిడ్, డిసెంబర్ 12: పర్యావరణ మార్పులను నిరోధించి పుడమిని రక్షించుకునే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలు ఓడిపోతున్నాయంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టెరాస్ హెచ్చరించారు. వెంటనే కర్బన వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఆర్థిక వ్యవస్థల దిశగా సాహసోపేత చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.