అంతర్జాతీయం

ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో మరణశిక్ష ఖరారయిన పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు శక్తివంతమయిన పాకిస్తాన్ సైన్యం బహిరంగంగానే మద్దతు పలకడంతో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు కానున్న అప్పీలుపై జరిగే విచారణ సందర్భంగా ముషారఫ్‌కు అండగా నిలవాలని నిర్ణయించింది. ఆరు సంవత్సరాల పాటు సాగిన విచారణ తరువాత దేశద్రోహం కేసులో ముషారఫ్‌కు న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. ఈ శిక్షను ప్రకటించిన సమయంలో ముషారఫ్ దేశంలో లేరు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ముషారఫ్ విదేశీ పర్యటనలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆయన 2016లో తన అనారోగ్యానికి చికిత్స కోసం దేశం విడిచివెళ్లారు. అప్పటి నుంచి ఆయన దుబాయిలో నివసిస్తున్నారు. ఇక్కడి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కోర్టు దేశద్రోహం కేసులో 76 ఏళ్ల ముషారఫ్‌ను దోషిగా నిర్ధారించింది. ముషారఫ్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారని కోర్టు 2013నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో ఇచ్చిన తన ఆదేశాలలో పేర్కొంది. మరణశిక్ష ఖరారయిన వెంటనే పాకిస్తాన్ సైన్యం ముషారఫ్‌కు బహిరంగంగా బాసటగా నిలిచింది. తమ మాజీ చీఫ్ జనరల్ (రిటైర్డ్) ముషారఫ్ ఎన్నడూ దేశద్రోహి కాలేదని, కాజాలడని, ఆయనకు వ్యతిరేకంగా వెలువడిన తీర్పు తమను ఎంతగానో బాధకు, క్షోభకు గురిచేస్తోందని పాకిస్తాన్ సాయుధ బలగాలలో పనిచేస్తున్న సిబ్బంది పేర్కొన్నారు. ‘ఒక మాజీ ఆర్మీ చీఫ్‌గా, చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్ట్ఫా కమిటీగా, పాకిస్తాన్ అధ్యక్షుడిగా 40 ఏళ్లకు పైగా దేశానికి సేవ చేసిన, దేశ రక్షణ కోసం యుద్ధాలు చేసిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నడూ దేశద్రోహి కాజాలడు’ అని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జెనీవాలో ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సైన్యం బహిరంగంగా చేసిన ఈ ప్రకటనతో భయపడిపోయి, వెంటనే తనకు నమ్మకస్తులయిన ఇద్దరు సహాయకులను రంగంలోకి దింపి, వారి ద్వారా ముషారఫ్‌కు పడిన మరణశిక్షపై అప్పీలు సమయంలో ఆయనకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని ఆర్మీకి హామీ ఇచ్చారు. ‘నేను ఈ కేసులో న్యాయాన్ని సమర్థిస్తాను. ఏ ఒక్క వ్యక్తినీ కాదు’ అని పాకిస్తాన్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ మంగళవారం పొద్దుపోయిన తరువాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు ఫిర్‌దౌస్ ఆషిక్ ఆవన్‌తో కలిసి ఆయన ఈ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక కోర్టు విచారణలో ముషారఫ్‌కు తగిన న్యాయం జరగలేదని, ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయకుండా, ఆయన దేశంలోనే లేనప్పుడు శిక్ష ఖరారు చేశారని మన్సూర్ ఖాన్ పేర్కొన్నారు.