అంతర్జాతీయం

ఈశాన్య భారతంలో పర్యటించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ లండన్: ఈశాన్య భారతదేశంలో పర్యటించేప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, కెనడా, సింగపూర్ సహా అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరించాయి. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు తమ పౌరులకు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి మత పరమయిన వేధింపుల కారణంగా భారత్‌లోకి వచ్చిన ముస్లిమేతరులకు ఈ సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఈశాన్య రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాలలో అక్రమ వలసల సమస్య మరింత పెరుగుతుందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వం అస్సాంలోకి తన అధికారిక పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు ఈ రాష్టమ్రే కేంద్ర బిందువుగా ఉంది. ‘పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడానికి వ్యతిరేకంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు, హింస కొనసాగుతున్నట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాలలో రవాణా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది’ అంటూ ఢిల్లీలోని అమెరికా ఎంబసీ భారత్‌లోని తన పౌరులను హెచ్చరించింది. అమెరికా ఎంబసీ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తమ పౌరులు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను కూడా సూచించింది. ప్రదర్శనలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించొద్దని బ్రిటన్ కూడా తన పౌరులకు సూచించింది.