అంతర్జాతీయం

ఉరికి ముందే ముషారఫ్ మరణిస్తే.. శవాన్నయనా వేలాడతీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ నియంత పర్వెజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పునకు సంబంధించిన వివరాలు గురువారం వెలుగు చూశాయి. ఈ తీర్పులో ప్రత్యేక కోర్టు 176పేజీల తీర్పు పాఠంలో చాలా తీవ్రమైన పదజాలానే్న ముషారఫ్‌పై ప్రయోగించింది. మరణ శిక్ష అమలులోగానే ముషారఫ్ మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని ఇస్లామాబాద్‌లోని సెంట్రల్ స్కేర్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు వేలాడదీయాలని త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాకర్ అహ్మద్ సేఠ్ ఈ తీర్పు రాశారు. దోషిపై దాఖలైన ప్రతి అభియోగానికి సంబంధించి అతడ్ని ఉరితీయాలని సేఠ్ పేర్కొన్నారు. శిక్ష అమలులోగా ముషారఫ్ మరణించినా సరే..అతడి శవాన్నయినా ఈడ్చుకొచ్చి ఇస్లామాబాద్‌లోని డి చౌక్ వద్ద మూడు రోజుల పాటు వేలాడదీయాలన్నారు. అధ్యక్ష భవనం, పార్లమెంట్, ప్రధాన మంత్రి కార్యాలయం, సుప్రీం కోర్టు భవనాలు ఇక్కడే ఉండటం గమనార్హం. ఈ త్రిసభ్య బెంచిలో సేఠ్, లాహోర్ హైకోర్టుకు చెందిన షాహిద్ కరీంలు ముషారఫ్‌కు విధించిన మరణ శిక్షను బలపరిస్తే సింధ్ హైకోర్టుకు చెందిన నాజర్ కరీం విభేదించారు. మరణించినా ముషారఫ్ శవాన్ని ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు వేలాడదీయాలన్న అంశంపై జస్టీస్ కరీం కూడా విభేదించారు. ఇందుకు చట్టంలో ఎలాంటి ఏర్పాటు లేదని, ఇలా కోర్టు తీర్పునివ్వడం ఈ కోర్టు పరిధికే విరుద్ధమని అన్నారు. దోషికి మరణ శిక్ష అమలు చేస్తే సరిపోతుందన్నది తన అభిప్రాయమని కరీం తెలిపారు. ప్రత్యేక కోర్టు తీర్పు అత్యంత శక్తివంతమైన సైనిక నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ తీర్పు మానవ,మత, నాగరిక విలువలకే విరుద్ధమని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా తీర్పు పాఠంలో ఉపయోగించిన పదజాలం మానవత్వ విలువల్నే హరించేదిగా ఉందని సైనక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ అన్నారు. ముషారఫ్‌కు మరణ శిక్ష విధించడంపై ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విస్తృతంగా చర్చించారని, ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ముషారఫ్ పట్ల కొందరు వ్యక్తులకు ఉన్న ద్వేషానే్న ఈ తీర్పు ప్రతిబింబిస్తోందని గఫూర్ అన్నారు.