అంతర్జాతీయం

ద్వైపాక్షిక సహకారం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 19: భారత్, అమెరికా తమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. రక్షణ, కౌంటర్‌టెర్రరిజం, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ రీజియన్‌ను స్వేచ్ఛాయుతమైన ప్రాంతంగా ఉంచడం కోసం ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన దేశాలతో కలిసి పనిచేయడం వంటి అంశాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇక్కడ జరిగిన రెండో భారత్-అమెరికా 2+2 చర్చలలో ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక్కడి అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో, రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య ఈ చర్చలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని ఆమోదించిన తరువాత గత సంవత్సరం సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య తొలి 2+2 చర్చలు జరిగాయి.
తాజాగా రెండోసారి జరిగిన 2+2 చర్చల్లో తమ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా విస్తరించుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పటిష్టమయిన రక్షణ సంబంధాలు ఒక ముఖ్యమయిన అంశంగా ఉన్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘గత కొనే్నళ్లుగా మా ఆయుధాల సేకరణను బహుముఖం చేయాలని, దేశీయం చేయాలని తెలివయిన నిర్ణయం తీసుకున్నాం. ఇది అమెరికాతో రక్షణ వాణిజ్యాన్ని పెంచింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘్భరత్, అమెరికాలలోని రక్షణ పరికరాల తయారీ రంగాలలో గొప్ప సహకారాన్ని, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు మేము కృషి చేస్తున్నాం. అమెరికాతో పారిశ్రామిక భద్రతా అనుసంధానం రక్షణ రంగ తయారీ (మాన్యుఫాక్చరింగ్) కేంద్రాలలో సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి సాధనకు అవసరమయిన చట్రాన్ని సమకూరుస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న సీమాంతర ఉగ్రవాదం అంశం కూడా ఈ 2+2 మంత్రుల స్థాయి చర్చలలో ప్రస్తావనకు వచ్చింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, హిందూమహాసముద్ర ప్రాంతంలో నెలకొని ఉన్న పరిస్థితులపై భారత్ తన అంచనాను అమెరికాతో పంచుకుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి పోంపియో మరో ముగ్గురు మంత్రులతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. ‘పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న సీమాంతర ఉగ్రవాదం గురించి భారత్‌కు ఉన్న సహేతుకమయిన ఆందోళనలను మేము అర్థం చేసుకున్నాం. మేము ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చాం’ అని పోంపియో అన్నారు.
*చిత్రం...భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న 2ప్లస్2 చర్చలు ముగింపు సందర్భంగా
సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్