అంతర్జాతీయం

ఒప్పందం లేకుండానే ముగిసిన చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 15: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో వాతావరణ మార్పును నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలపై అత్యంత సుదీర్ఘ సమయం పాటు జరిగిన అంతర్జాతీయ సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ఆదివారం ముగిసింది. దాదాపు 200 దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ప్రపంచ కార్బన్ మార్కెట్లపై కీలక నిర్ణయాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు. భూతాపాన్ని నియంత్రించడంపై రెండు వారాల పాటు చర్చలు జరిపిన తరువాత, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భూగ్రహం వేడెక్కడానికి కారణమయిన గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించాలని, వాతావరణ మార్పు ప్రభావం వల్ల సతమతం అవుతున్న పేద దేశాలకు చేయూతనివ్వాలని ఉన్నతమయిన ఆకాంక్షకు పిలుపునిస్తూ డిక్లరేషన్లను ఆమోదించారు. సుమారు 25 సంవత్సరాలుగా వార్షిక సమావేశాలు జరుగుతున్నప్పటికీ, గతంలో ఏ సమావేశంలోనూ లేనంతగా మాడ్రిడ్‌లో ఎక్కువ రోజులు సంప్రదింపులు జరిపినప్పటికీ, కీలకమయిన విషయాలపై ఒప్పందాలను మాత్రం మరో ఏడాది తరువాత, వచ్చే సంవత్సరం గ్లాస్‌గోలో జరిగే శిఖరాగ్ర చర్చల నాటికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ప్రపంచంలోని సంపన్న దేశాలు వాతావరణ మార్పును నిరోధించడంపై స్వల్ప స్థాయిలో నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని పర్యావరణ పరిరక్షణ బృందాలు, కార్యకర్తలు విమర్శించారు. సుదీర్ఘంగా సాగిన మాడ్రిడ్ చర్చలు ఆదివారంతో ముగిశాయి.
రెండు వారాలకు పైగా చర్చలు జరిగినప్పటికీ ప్రపంచ కార్బన్ మార్కెట్ల భవిష్యత్తు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. చివరి నిముషంలోని తీవ్రమయిన విభేదాలు నిర్ణయాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసేలా చేశాయి. గత 25 సంవత్సరాలుగా సాగుతున్న వాతావరణ చర్చల్లో ఈ సంవత్సరం సాగిన చర్చలు అత్యంత ఎక్కువ రోజులు జరిగిన చర్చలుగా రికార్డు సృష్టించాయి. 40 గంటలకు పైగా అధిక సమయం చర్చలు జరిపినప్పటికీ నిద్రలేని రాత్రులు గడిపిన ప్రతినిధులు చివరకు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఆదివారం ఉదయం ముగింపు ప్లీనరీ నిర్వహించాల్సి వచ్చింది. ప్రతినిధులు అంతకు ముందు ఆమోదించిన ‘చిలీ-మాడ్రిడ్ టైమ్ ఫర్ యాక్షన్’ డిక్లరేషన్‌లో గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి వివిధ దేశాలు తమ ప్రస్తుత హామీలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పు వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్న చిన్న ద్వీపకల్పాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలని కూడా మాడ్రిడ్ శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్న దేశాలు అంగీకారానికి వచ్చాయి.