అంతర్జాతీయం

జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 15: లండన్‌లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ద్వితీయ స్థానం (రన్నర్ అప్)లో భారత్‌కు చెందిన సుమన్ రావు నిలిచారు.
శనివారం లండన్‌లోని ఎక్సెల్ నగరంలో జరిగిన మిస్ వరల్డ్-2019 పోటీలు కన్నుల పండువగా జరిగాయి. జమైకాకు చెందిన 23 ఏళ్ళ టోని అన్ సింగ్ ప్రపంచ సుందరిగా ఎన్నికైనట్లు పోటీ నిర్వహించిన బ్రిటీష్ టెలివిజన్ కరతాళధ్వనుల మధ్య ప్రకటించింది. విశ్వసుందరిగా ఎంపికైన టోని ఆన్ సింగ్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ విద్యార్థినిగా ఉన్నారు. సైకాలజీ డాక్టర్ కావడమే తన లక్ష్యమని టోని చెప్పారు. విశ్వ సుందరిగా ఎంపికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు చూపిన ప్రేమాభిమానాలతో తన మనస్సు నిండిపోయిందని ఆమె సభికులనుద్ధేశించి తెలిపారు. తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, బంధు, మిత్రులకు ఆమె వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలిపారు. 69వ విశ్వ సుందరిగా ఆమె ఎంపికయ్యారు. గత ఏడాది విశ్వ సుందరిగా ఎంపికైన మెక్సికో వనిత వెన్సాఫోన్స్ తాజా మిస్ వరల్డ్ కిరీటాన్ని జమైకాకు అందించారు. ఇప్పటి వరకు 1963, 1976, 1993 సంవత్సరాల్లో కూడా మిస్ వరల్డ్ కిరీటాన్ని జమైకా కైవసం చేసుకోవడం గమనార్హం.

*చిత్రాలు.. విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నజమైకా వనిత టోని అన్ సింగ్
*ఈ పోటీల్లో రెండో స్థానం సంపాదించుకున్న భారతీయ వనిత సుమన్ రావు నాట్య విన్యాసం