S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/07/2020 - 05:37

వాషింగ్టన్, జనవరి 6: ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా దళాలు ఇరాక్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ అమెరికా దళాలు వైదొలగాలంటే అక్కడ నిర్మించుకున్న ఎయిర్ బేస్ ఖర్చు మొత్తాన్నీ తమకు చెల్లించాలని అన్నారు.

01/06/2020 - 05:40

ఇస్లామాబాద్, జనవరి 5: లాహోర్‌కు సమీపంలోని నాన్‌కనా షాహిబ్‌లో సిక్కు మత తొలి గురువు’నాన్‌క్’ జన్మస్థలంగా భావించే పవిత్ర గురుద్వారాలో ఇటీవల జరిగిన విధ్వంస కాండను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం నాడిక్కడ ఖండించారు. ఘటనపై ఎట్టకేలకు స్పందించిన ఇమ్రాన్ ‘ఆ ఘటన తన అభిమతానికి వ్యతిరేకంగా జరిగిపోయిందని, దోషులను ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోద’ని స్పష్టం చేశారు.

01/05/2020 - 02:23

వాషింగ్టన్: ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సొలేమానీని లక్ష్యిత దాడిలో హతమార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం గట్టిగా సమర్థించుకున్నారు. ‘ఉగ్రవాద హయాం అంతమయింది’ అని ఆయన అన్నారు. ఖాసీం సోలేమాని అనేక ఉగ్రవాద కుట్రలకు సూత్రధారి అని ఆయన పేర్కొన్నారు.

01/05/2020 - 01:44

బాగ్దాద్, జనవరి 4: అమెరికా జరిపిన లక్ష్యిత దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ ప్రతిన బూనింది. బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలో అమెరికా జరిపిన లక్ష్యిత దాడిలో తన టాప్ కమాండర్ ఒకరు మృతి చెందిన నేపథ్యంలో ఇరాన్ బదులు తీర్చుకుంటానని దృఢంగా ప్రకటించింది. లక్ష్యిత దాడి వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి మరికొన్ని వేల బలగాలను పంపిస్తున్నట్టు అమెరికా శుక్రవారం ప్రకటించింది.

01/03/2020 - 06:03

ఐక్యరాజ్యసమితి: జనాభా విషయంలో భారత్ కొన్నాళ్లకు చైనాను మించిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనడానికి నిదర్శనం నూతన సంవత్సరం రోజున (జనవరి 1న) దేశంలో జరిగిన పురుళ్లేనని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీన జరిగిన పురుళ్లలో భారత్ అన్ని దేశాలకూ దీటుగా నిలుస్తూ మొదటి స్థానంలోకి చేరిపోయింది.

01/02/2020 - 05:20

జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తా నగర ప్రజలకు నూతన సంవత్సర ఆరంభ దినం ఎనలేని కష్టాలనే మోసుకొచ్చింది. కుండపోత వర్షాలు కురియడంతో నగరంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరదలు ముంచెత్తి తొమ్మిది మంది మృతి చెందారు. బుధవారం నాడు ఏకధారగా కురిసిన వర్షాల కారణంగా 30 మిలియన్ల మంది నివసిస్తున్న గ్రేటర్ జకార్తా నగరంలోని అనేక కాలనీలలో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకొని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

01/02/2020 - 01:57

సియోల్, జనవరి 1: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని ఇచ్చే ఉపన్యాసం తీరులో ఈసారి మార్పు చోటు చేసుకుంది. అమెరికాతో నెరపిన దౌత్య వ్యవహారాలలో గత రెండు సంవత్సరాలలో చోటు చేసుకున్న పొరపాట్లను అంగీకరించకుండా ఉండేందుకే బుధవారం నాటి కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగం తీరులో మార్పు వచ్చిందని విశే్లషకులు పేర్కొన్నారు.

01/02/2020 - 01:46

హాంకాంగ్, జనవరి 1: హాంగ్-కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. బుధవారం కొత్త సంవత్సరం రోజున వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాదు హాంగ్-కాంగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి భారీ కవాతులో పాల్గొన్నారు. సుమారు ఏడు నెలలుగా జరుగుతున్న ఆందోళనలతో హాంగ్- కాంగ్ అట్టుడుకుతున్నది.

12/31/2019 - 23:42

బాగ్దాద్, డిసెంబర్ 31: ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడికి దిగారు. కార్యాలయ ప్రహరీని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇటీవల అమెరికా జరిపిన విమాన దాడుల్లో ఇరాన్ అనుకూల వాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందంచిన ఇరాన్ అనుకూల, షియా ముస్లిం వర్గానికి చెందిన ఆందోళనకారులు వేల సంఖ్యలో యూఎస్ అంబెసీపైకి దూసుకెళ్లారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

12/31/2019 - 23:37

ఢాకా, డిసెంబర్ 31: భద్రతా కారణాలను ఉటంకిస్తూ, భారత్, మైన్మార్ సరిహద్దుల్లో మొబైల్ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిర్ణయం కారణంగా, సరిహద్దు నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకూ మొబైల్ సేవలు నిలిచిపోయాయి. కనీసం కోటి మంది వినియోగదారులకు సేవలు అందకుండా పోయాయి. బంగ్లాదేశ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.

Pages