అంతర్జాతీయం

‘ఉగ్రవాద హయాం అంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సొలేమానీని లక్ష్యిత దాడిలో హతమార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం గట్టిగా సమర్థించుకున్నారు. ‘ఉగ్రవాద హయాం అంతమయింది’ అని ఆయన అన్నారు. ఖాసీం సోలేమాని అనేక ఉగ్రవాద కుట్రలకు సూత్రధారి అని ఆయన పేర్కొన్నారు. బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా శుక్రవారం జరిపిన లక్ష్యిత దాడిలో ఇరాన్ ఉన్నత స్థాయి అల్-ఖుద్స్ ఫోర్స్ అధిపతి, దాని ప్రాంతీయ భద్రతా విభాగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జనరల్ ఖాసీం సోలేమాని మృతి చెందిన విషయం తెలిసిందే. ‘ఇరాక్‌లోని అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని ఇటీవలి కాలంలో జరిగిన దాడులన్నిటికీ సూత్రధారి ఖాసీం సోలేమానినే. ఒక అమెరికన్‌ను హతమార్చిన, మరో నలుగురు అమెరికా సైనికులను తీవ్రంగా గాయపరచిన రాకెట్ దాడులు సోలేమాని కనుసన్నుల్లోనే జరిగాయి. బాగ్దాద్‌లోని మా ఎంబసీపై జరిగిన హింసాత్మక దాడికి కుట్ర పన్నింది కూడా సోలేమానినే’ అని ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-అ-లాగో వద్ద విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘సోలేమాని అనేక మంది అమాయకులను హతమార్చాడు. అనేక ఉగ్రవాద కుట్రలకు చేయూతనిచ్చాడు. సోలేమాని జరిపిన అనేక అత్యాచారాల బాధితులను ఈ రోజు మేము గుర్తు చేసుకుంటున్నాం. అతని ఉగ్రవాద హయాం ముగిసిపోయిందని తెలుసుకున్నాం’ అని ట్రంప్ అన్నారు. సోలేమాని గత 20 ఏళ్లుగా మధ్యప్రాచ్యాన్ని అస్థిరత్వం పాల్జేయడానికి ఉగ్రవాద కార్యకలాపాలను పెంచిపోషిస్తూ వచ్చాడని ట్రంప్ ఆరోపించారు. ‘అమెరికా నిన్న చేసిన పనిని ఎంతో కాలం ముందే చేసి ఉండాల్సింది. అనేక మంది ప్రాణాలు పోకుండా ఉండేవి. ఇటీవలి కాలంలో సోలేమాని ఇరాన్‌లో నిరసనలను క్రూరంగా అణచివేశాడు. వెయ్యికి పైగా మంది అమాయక ఇరాన్ ప్రజలను స్వంత ప్రభుత్వమే చిత్రహింసలు పెట్టడమో, హతమార్చడమో చేసింది’ అని ట్రంప్ అన్నారు. సోలేమాని హత్య యుద్ధానికి దారితీయదని ఆయన పేర్కొన్నారు. ‘యుద్ధాన్ని నివారించడానికే మేము నిన్న రాత్రి చర్య తీసుకున్నాం. మేము యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ చర్య తీసుకోలేదు. నేను ఇరాన్ ప్రజలను ఎంతగానో గౌరవిస్తాను’ అని ట్రంప్ అన్నారు.
'చిత్రం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్