అంతర్జాతీయం

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జనవరి 1: హాంగ్-కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. బుధవారం కొత్త సంవత్సరం రోజున వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాదు హాంగ్-కాంగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి భారీ కవాతులో పాల్గొన్నారు. సుమారు ఏడు నెలలుగా జరుగుతున్న ఆందోళనలతో హాంగ్- కాంగ్ అట్టుడుకుతున్నది. అల్లర్లతో జన జీవనం స్తంభించింది. రవాణ వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రధాన భూభాగమైన చైనాకు రప్పించే ప్రతిపాదన ద్వారా ఈ తిరుగుబాటుకు తెర లేచింది. కానీ బీజింగ్ అనే భయానికి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటుగా మార్చబడింది. బుధవారం వేల సంఖ్యలో నిరసనకారులు, ఆందోళనకారులు విక్టోరియా పార్కు వద్ద గుమిగూడి హాంగ్-కాంగ్ ప్రధాన రహదారుల్లో భారీ కవాతు నిర్వహించారు. కాజ్-వే, ఇతర దారులన్నీ క్రిక్కిరిసిపోయాయి. దీంతో పర్యాటకులు కొంత ఇబ్బంది పడ్డారు. ప్రధాన వాణిజ్య, వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. పౌర హక్కుల ఫ్రంట్ సారథ్యంలో జరిగిన ఈ భారీ కవాతులో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కవాతులో పాల్గొన్న వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాసి ప్ల-కార్డులను చేతబూనారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్న, పెద్ద, ముదుసలి అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారూ ఈ కవాతులో పాల్గొన్నారు. స్వేచ్చాయుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, ఇటీవల శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, విచక్షణారహితంగా లాఠీ ఛార్జి చేసి, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించిన ఘటనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, అరెస్టు చేసిన 6,500 మందిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున నిరసన సెగ తగలాల్సి ఉందని ప్రజలు తెలిపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని, అమానుషంగా చితకబాదారని వారన్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిని ఖండించారు. ఆందోళనకారులు పెట్రోలు బాంబులు విసిరారని, వాణిజ్య, వ్యాపారులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అశాంతి కలిగించేందుకు విదేశీ శక్తులూ ప్రయత్నిస్తున్నాయని చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆరోపించారు.

'చిత్రం... హాంకాంగ్‌లో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య అనుకూలవాదులు.