అంతర్జాతీయం

సరిహద్దుల్లో మొబైల్ సేవలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 31: భద్రతా కారణాలను ఉటంకిస్తూ, భారత్, మైన్మార్ సరిహద్దుల్లో మొబైల్ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిర్ణయం కారణంగా, సరిహద్దు నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకూ మొబైల్ సేవలు నిలిచిపోయాయి. కనీసం కోటి మంది వినియోగదారులకు సేవలు అందకుండా పోయాయి. బంగ్లాదేశ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ టెలీకమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమిషన్ (బీటీఆర్‌సీ) దీనిని అమలు చేయడంతో, సరిహద్దుల్లో గ్రామీణఫోన్, టెలీటాక్, రోబీ, బంగ్లాలింక్ తదితర సర్వీస్ ప్రొవైడర్ల సేవలు నిలిచిపోయాయి. భద్రతా కారణాలనే పదాన్ని ప్రభుత్వం పేర్కొందే తప్ప, అంతకు మించిన వివరాలను ఇవ్వలేదు. కాగా, బంగ్లాదేశ్ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమల్, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ తమకు ఈ పరిణామం పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. తమను సంప్రదించిన మీడియా సంస్థలతో వారు మాట్లాడుతూ, భారత్, మైన్మార్ సరిహద్దుల్లో కిలోమీటర్ దూరం వరకూ మొబైల్ సేవలను నిలిపివేసినట్టు తమకు తెలియదని పేర్కొన్నారు. భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని తెలిపారు. ఈ పరిణామంపై మరింతగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.