అంతర్జాతీయం
మారనున్న ఉత్తర కొరియా వైఖరి?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సియోల్, జనవరి 1: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని ఇచ్చే ఉపన్యాసం తీరులో ఈసారి మార్పు చోటు చేసుకుంది. అమెరికాతో నెరపిన దౌత్య వ్యవహారాలలో గత రెండు సంవత్సరాలలో చోటు చేసుకున్న పొరపాట్లను అంగీకరించకుండా ఉండేందుకే బుధవారం నాటి కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగం తీరులో మార్పు వచ్చిందని విశే్లషకులు పేర్కొన్నారు. ఉత్తర కొరియా గత రెండేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న విధానంలో మార్పు కూడా చోటు చేసుకుంటుందని అధ్యక్షుడి ఉపన్యాసం సంకేతాలు ఇచ్చిందని కూడా వారు విశే్లషించారు. కిమ్ జోంగ్ ఉన్ తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపక అధ్యక్షుడు కిమ్ 2 సంగ్ ప్రారంభించిన నూతన సంవత్సర ఆరంభం నాడు ఉపన్యాసం ఇచ్చే సంప్రదాయాన్ని పునరుద్ధరించి, 2013 నుంచి ప్రసంగిస్తూ వస్తున్నారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సాధారణంగా ఉత్తర కొరియా రాజకీయాలకు సంబంధించి గతంలో జరిగిన అంశాలను సమీక్షించి, భవిష్యత్తుకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రకటించడం చేస్తుంటారు. అధ్యక్షుడి ఉపన్యాసాన్ని పూర్తిగా అధికార పత్రిక రొడోంగ్ సిన్‌మున్‌లో ప్రచురిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తుంటారు. తొలిసారి పార్టీ యూనిఫామ్ ధరించి ఉత్తర కొరియా బలగాలను ఉద్దేశించి కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగించారు. అయితే, ఈసారి జనవరి ఒకటో తేదీ ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. మధ్యాహ్నం కూడా అధికారిక టెలివిజన్ అధ్యక్షుడు ఉన్ ప్రసంగాన్ని పూర్తిగా ప్రసారం చేయలేదు. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రసారం చేసింది. ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై తనకు తానుగా విధించుకున్న మారటోరియానికి ఇంకెంతో కాలం కట్టుబడి ఉండకపోవచ్చని ఉన్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా గత రెండేళ్లుగా అనుసరిస్తున్న దౌత్య విధానం నుంచి తప్పుకోబోతున్నట్టు అధ్యక్షుడి ఉపన్యాసం సంకేత ప్రాయంగా వెల్లడిస్తోందని విశే్లషకులు పేర్కొన్నారు. ఈ రెండేళ్ల కాలం లో అనుసరించిన విధానం వల్ల ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆంక్షలు పెద్దగా సడలిపోలేదు.
అణునిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియా తీసుకున్న చర్యలు అమెరికాను కూడా పెద్దగా సంతృప్తి పరచలేదు. ఉత్తర కొరియా గత రెండేళ్లుగా అనుసరించిన విధానంలో చోటు చేసుకున్న పొరపాట్లను అంగీకరించకుండా ఉండే ఉద్దేశంతోనే అధ్యక్షుడి ఉపన్యాసం తీరులో మార్పు చోటు చేసుకుందని భావిస్తున్నట్టు దక్షిణ కొరియాలోని హాండోంగ్ యూనివర్శిటీ అంతర్జాతీయ అధ్యయనాల విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పార్క్ వోన్-గోన్ పేర్కొన్నారు.
'చిత్రం... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్