S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/16/2020 - 05:04

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 15: పాకిస్తాన్ శనివారం ఇండియన్ హైకమిషన్‌కు చెందిన ఒక సీనియర్ దౌత్యవేత్తను పిలిపించి, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై గట్టి నిరసన వ్యక్తం చేసింది. భారత భద్రతా బలగాలు ఫిబ్రవరి 14వ తేదీన నియంత్రణ రేఖ వెంట గల నేజాపీర్, రాఖ్‌చిక్రి సెక్టార్లలో సరిహద్దుల మీదుగా కాల్పులు జరిపాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది.

02/16/2020 - 04:23

బీజింగ్/ఊహన్: ఇప్పటికే 1,500 మంది ప్రాణాలను బలిగొని అత్యంత భయానక వాతావరణం సృష్టిస్తున్న కరోనా వైరస్‌పై తాము సాగిస్తున్న పోరాటం అత్యంత కీలకమైన దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ మొదలై నెల రోజులు దాటినా దాని తీవ్రత ఇంకా పెరగడంతో అధికారులు అన్నివిధాలుగా నిరోధక చర్యలపై దృష్టి పెట్టారు.

02/13/2020 - 00:47

లాహోర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు హాజరవుతున్న జైషే ఉద్ దౌలా చీఫ్ అఫిస్ సరుూద్. ముంబయి దాడుల వెనుక సూత్రధారిగా రుజువైన కారణంగా కోర్టు అతనికి 5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

02/12/2020 - 23:44

వాషింగ్టన్: మొట్టమొదటి సారి భారత్‌లో పర్యటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పలు అంశాలను చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన అమెరికా అద్యక్షునిగా ఎన్నికైన తర్వాత భారత్‌లో పర్యటించలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటనకు రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ లోగడ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇది ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించారు.

02/11/2020 - 04:53

లాస్‌ఏంజిల్స్, ఫిబ్రవరి 10: ఈసారి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ‘పారాసైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఎప్పుడు ఏ అంతర్జాతీయ అవార్డులు ప్రకటించినా ఉత్తమ చిత్రం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొంటుంది. అయితే, ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన అంచనాలను తలకిందులు చేస్తూ ‘పారాసైట్’ చిత్రం ఉత్తమ ఆస్కార్‌ను కైవసం చేసుకొంది.

02/10/2020 - 05:13

బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనాలో ఇప్పటికే 811 మందిని బలిగొన్న ఈ వైరస్ 25 దేశాలకు పైగా వ్యాప్తించి ఆయా దేశాల పాలనా వ్యవస్థలను అట్టుడికిస్తోంది. 2002లో సంభవించిన ‘సార్స్’ వైరస్ వల్ల మృతి చెందినవారి కంటే కూడా ఈ తాజా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 37 వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు.

02/10/2020 - 05:10

సింగపూర్, ఫిబ్రవరి 9: చైనాతోపాటు దాదాపు పాతిక దేశాలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాణాంతక మహమ్మారిని ఏవిధంగా కట్టడి చేయాలన్న దానిపై అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు శాస్త్ర ప్రపంచం తలమునకలైంది.

02/09/2020 - 06:12

బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఒక సైనికుడు 17మందిని కాల్చి చంపాడు. పైగా ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని థాయిలాండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ శనివారం తెలిపింది. ఒక టౌన్ సెంటర్ మాల్‌పై కేంద్రీకరించి ఆ సైనికుడు దాడికి పాల్పడ్డాడు. థాయిలాండ్‌లోని ఈశాన్య నగరమయిన నాఖోన్ రాట్‌చసిమలో ఒక ఆర్మీ బ్యారక్స్ వద్ద మధ్యాహ్నం తరువాత ఈ దాడి మొదలయిందని పోలీసులు ఒక వార్తాసంస్థకు తెలిపారు.

02/09/2020 - 05:09

బీజింగ్, ఫిబ్రవరి 8: చైనాలో కొత్త కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య వేగంగా 722కు పెరిగింది. తాజాగా ఒక్క రోజే 86మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది వైరస్ తీవ్రంగా ప్రబలిన హ్యుబేయి ప్రావిన్స్‌లో చనిపోయారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారి సంఖ్య 34,546కు పెరిగినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు.

02/09/2020 - 05:07

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న నరేంద్ర మోదీ సర్కారు లక్ష్య సాధనలో వాణిజ్య, వ్యాపారపరంగా అమెరికాకు ప్రాధాన్యతాపూర్వక స్థానం ఉంటుందని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ స్పష్టం చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం తన గౌరవార్థం ఇచ్చిన ఓ విందు కార్యక్రమంలో అమెరికా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Pages