అంతర్జాతీయం

దోషులెవరినీ ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 5: లాహోర్‌కు సమీపంలోని నాన్‌కనా షాహిబ్‌లో సిక్కు మత తొలి గురువు’నాన్‌క్’ జన్మస్థలంగా భావించే పవిత్ర గురుద్వారాలో ఇటీవల జరిగిన విధ్వంస కాండను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం నాడిక్కడ ఖండించారు. ఘటనపై ఎట్టకేలకు స్పందించిన ఇమ్రాన్ ‘ఆ ఘటన తన అభిమతానికి వ్యతిరేకంగా జరిగిపోయిందని, దోషులను ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోద’ని స్పష్టం చేశారు. ప్రపంచంలోని సిక్కు మతస్థులందరూ అతి పవిత్రంగా భావించే ‘గురుద్వారా జనమ్ ఆస్థాన్’కు విశిష్టత ఉందన్నారు. రెచ్చిపోయిన ఓ గుంపు గత శుక్రవారం నాడు ఆ పవిత్ర క్షేత్రంపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడిందని మీడియా సమాచారాన్నిబట్టి తెలిసిందన్నారు. ఆ సమయంలో ఓ పోలీసు బృందం విద్వంసాన్ని అడ్డుకోవడానికి గట్టిగా ప్రయత్నించిందని తెలిపారు. ‘ఐతే పాక్‌లో జరిగిన ఈ విధ్వంసానికి, భారత్‌లో ముస్లింలు, ఇతర మైనారీటీలపై జరుగుతున్న దాడులకు ఎంతో తేడా ఉంద’ని ఇమ్రాన్ ఆరోపించారు. ‘ఇక్కడ జరిగిన దురదృష్టకర సంఘటన నా దృక్ఫథానికి విరుద్ధం. దానిపై నిష్పక్షపాతంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దోషులెవ్వరినీ ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం..పోలీసులు..న్యాయ విభాగాలు తమ బాధ్యతను నిర్వహిస్తాయ’ని ఇమ్రాన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ’ఐతే భారత ప్రధాని దృక్పథం మరోలా ఉంది. మైనారీటీలను అణచివేయడం, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నార’ని ఇమ్రాన్ ఆరోపించారు. ప్రభుత్వ మద్దతుతో భారత పోలీసులు ముస్లింలపై దాడులకు నాయకత్వం వహిస్తున్నార’ని ఆరోపించారు.