S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/25/2019 - 00:46

న్యూయార్క్, సెప్టెంబర్ 24: కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ ప్రధాన మంత్రులు కలిసి కట్టుగా పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

09/25/2019 - 00:44

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ/ జమ్మూ, సెప్టెంబర్ 24: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సహా పాకిస్తాన్‌లోని అనేక ఈశాన్య రాష్ట్రాలను మంగళవారం సాయంత్రం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. శక్తివంతమయిన ఈ భూకంపం కారణంగా 20 మంది మృతి చెందగా, 300కు పైగా మంది గాయపడ్డారు.

09/24/2019 - 22:47

హూస్టన్, సెప్టెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని కాశ్మీరీ పండిట్ల హృదయాలను గెలుచుకున్నారు. కాశ్మీరీ పండిట్లతో మమేకమయి, వారి అనుభవాలను, కష్టనష్టాలను ఓర్పుతో విని, సహానుభూతిని వ్యక్తం చేయడం ద్వారా వారి విశ్వాసాన్ని చూరగొన్నారు.

09/24/2019 - 22:41

లండన్, సెప్టెంబర్ 24: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన బ్రెగ్జిట్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు తీవ్ర విఘాతం ఎదురైంది. పార్లమెంటును ఐదు వారాలపాటు సస్పెండ్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బ్రిటన్ సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

09/24/2019 - 00:50

న్యూయార్క్, సెప్టెంబర్ 23: సమస్త జీవజాతులకు పెనుముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు ప్రపంచ ప్రజా ఉద్యమమే పరిష్కారమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాటలు కట్టిపెట్టి, చేతలతోనే ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ప్రవాహాల్లాంటి ప్రసంగాల కంటే నీటిబొట్టులాంటి వాస్తవిక ప్రయత్నమే ఎంతో విలువైనదని ఆయన స్పష్టం చేశారు.

09/24/2019 - 01:56

*చిత్రం...న్యూయార్క్‌లో విశ్వజనీన ఆరోగ్య సర్వీసులపై సోమవారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతున్న భారత ప్రధాని మోదీ

09/23/2019 - 01:25

హోస్టన్, సెప్టెంబర్ 22: గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. హోస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ మెగా కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ఉభయ దేశాలూ ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పని చేస్తున్నాయని తెలిపారు.

09/23/2019 - 01:23

హోస్టన్, సెప్టెంబర్ 22: హోస్టన్ వేదిక సాక్షిగా భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50 వేల మందికి పైగా హాజరైన హౌడీ-మోదీ చారిత్రక సదస్సునుద్ధేశించి మాట్లాడిన మోదీ ఇరు దేశాల మైత్రి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడంతో పాటు అన్ని రంగాల్లోనూ బలమైన బంధాన్ని పాదుకొలిపిందన్నారు.

09/23/2019 - 01:21

హోస్టన్, సెప్టెంబర్ 22:భారత ప్రధాని నరేంద్ర మోదీకి హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో అత్యంత ఉత్తేజకర రీతిలో దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు ముక్తకంఠంతో స్వాగతం పలికారు. మోదీ వేదికపైకి అడుగు పెట్టినప్పటి నుంచి హౌడీ-మోదీ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మోదీకి ఆహ్వానం పలుకుతూ ప్రేక్షకుల హర్షధ్వనాలతో వేదిక ప్రాంగణం ప్రతిధ్వనించింది.

09/23/2019 - 00:19

హోస్టన్, సెప్టెంబర్ 22: పెరుగుతున్న భారత ఇంధన అవసరాలను తీర్చుకునే అంశంపై అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు కంపెనీల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఈ రెండు రంగాల్లో ఉన్న అవకాశాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై వీరితో ఆయన చర్చించారు.

Pages