అంతర్జాతీయం
ముషారఫ్ మరణశిక్ష రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను ఆ దేశ ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ముషారఫ్‌పై దాఖలైన దేశ ద్రోహ కేసులో ఫిర్యాదు, విచారణ తీరును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న 74 ఏళ్ల ముషారఫ్‌కు దేశద్రోహ కేసులో మరణ శిక్ష విధిస్తూ గత నెల 17న ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు సయ్యద్ మజాహర్ నఖ్వీ, మహ్మద్ అమీర్ భత్తీ, చౌదరి మసూద్ జహంగీర్‌లతో కూడిన లాహోర్ హైకోర్టు బెంచ్ ఈ తాజా తీర్పును వెలువరించింది. ముషారఫ్‌పై దేశద్రోహ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును నియమించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అలాగే, ముషారఫ్‌పై దాఖలైన దేశద్రోహ కేసు కూడా చట్ట ప్రకారం లేదని తేల్చిచెప్పింది. ముషారఫ్‌పై ఫిర్యాదు మొదలుకొని అంతిమంగా ఆయనకు మరణశిక్ష విధించే వరకు ప్రత్యేక కోర్టు తీసుకొన్న నిర్ణయాలు అన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమైనవిగా లాహోర్ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ అదనపు అటార్నీ జనరల్ ఇస్టియాక్ ఖాన్ మీడియాకు తెలిపారు. లాహోర్ హైకోర్టు తాజాతీర్పుతో ముషారఫ్‌కు అన్ని కేసుల నుంచి విముక్తి లభించిందనీ.. ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి అనీ అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. అసలు కేబినెట్ ఆమోదం లేకుండానే ముషారఫ్‌పై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును నియమించాలని లాహోర్ హైకోర్టుకు తెలిపారు. అలాగే, ముషారఫ్‌పై దాఖలైన కేసు అభియోగాలన్నీ కూడా నిరాధారమైనవని స్పష్టం చేశారు. కాగా, గత ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ లాహోర్ హైకోర్టు తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ఆరోగ్యంమెరుగౌతోందని తెలిపారు. దేశ ద్రోహ కేసులో తనకు మరణశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకొనే లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది.
'చిత్రం...పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్