అంతర్జాతీయం

అమెరికా దీవిలో తీవ్ర భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్ జువాన్, జనవరి 7: అమెరికా భూ భాగంలోని ప్యూర్టో రికోలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న దీవిలో ఇటీవల సంభవించిన భూకపంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం మరోసారి ప్రకంపనలు సంభవించాయి. దేశానికి విద్యుత్‌ను అందించే ప్రధాన పవర్ ప్లాంట్‌లు దెబ్బతిన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ట్వీట్ చేశారు. అమెరికా జియోగ్రఫికల్ సర్వే వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 4:24కు భూమికంపించింది. దీవికి దక్షిణాన పదికిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని సంస్థ ప్రకటించింది. తొలుత రిక్టార్ స్కేల్‌పై 6.6 డిగ్రీలు తీవ్ర కనిపించినా 6.4 వద్ద రికార్డయిందని వారన్నారు. తరువాత కూడా 5.6 నుంచి 4.5 ప్రకంపనలు నమోదయ్యాయి. తీవ్రత ఎక్కువగా ఉండడంతో తొలుత సునానీ హెచ్చరికలు చేసిన అధికారులు తరువాత ఉప సంహరించుకున్నారు. ప్యూర్టోరికో సహా పరిసర దీవుల్లోనూ అప్రమత్తత ప్రకటించారు. నైరుతీ పట్టణమైన గ్యూనికాకు చెందిన ఆల్బర్ట్ రొడ్రిగ్ మాట్లాడుతూ భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పారు. గ్యుయానిల్లా మేయర్ నెల్సన్ టొర్రెస్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పబ్లిక్ ప్లాజాలోని చర్చి కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ప్యూర్టోరికో భూకంప కేంద్ర డైరెక్టర్ విక్టర్ హెర్‌ఫెనో మాట్లాడుతూ సమాచార వ్యవస్థ ధ్వంసం కావడం వల్ల ఏమేరకు నష్టం జరిగిందీ సమాచారం లేదని చెప్పారు. భూ ప్రకంపనలు వస్తునే ఉన్నాయని అన్నారు. వెలుతురు వచ్చేవరకూ ఇళ్లలోకి వెళ్లవద్దని, సహాయక బృందాలకు సహకరించాలని గవర్నర్ వాండా వాస్‌ఖ్వెజ్ ఉదయం 6 గంటలకు ఓ రేడియో కేంద్రంలో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.