అంతర్జాతీయం

కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం: 176 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, జనవరి 8: ఉక్రెయిన్ విమానం టెహ్రాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ చేసిన కొద్దిసేపటికే అగ్నిగోళంగా మారి కుప్పకూలింది. ఈ సంఘటనలో 176 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ఇ 737 జెట్ విమానం 167 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో టెహ్రాన్ నుంచి బుధవారం టేకాఫ్ తీసుకుంది. అయితే, కొద్దిసేపటికే గాలిలోనే మండుతూ కూలిపోయింది. తొలుత ఈ విమానంలో 180 మంది ఉన్నట్టు అధికారులు అనుమానించారు. అయితే, చివరకు 176 మందిగా ధ్రువీకరించారు. వీరిలో 82 మంది ఇరానీయులు కాగా, 63 మంది కెనడా దేశస్థులు, 11 మంది ఉక్రెయిన్ పౌరులు, స్వీడన్‌కు చెందిన 10 మంది, అఫ్గాన్ దేశానికి చెందిన నలుగురు, జర్మనీ, బ్రిటన్ నుంచి ముగ్గురేసి చొప్పున ఉన్నారు. మృతి చెందినవారిలో షెరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మాజీ విద్యార్థులు 13 మంది ఉన్నారని సమాచారం. సంఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ 22 క్షిపణులను ప్రయోగించిన సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలాంటి వివరణలూ ఇవ్వలేదు. కాగా, ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధ్యక్షుడు ఎహెనీ డైనీ మాత్రం సిబ్బంది పొరపాటు ఏమాత్రం ఉండదని వ్యాఖ్యానించారు. అసలు అలాంటి పొరపాటుకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. పైలట్‌కు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందని, ఇతర సిబ్బంది కూడా నిష్ణాతులేనని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ అధికారులు ఈ సంఘటనపై ప్రత్యేక వ్యాఖ్యలేమీ చేయలేదు. సంఘటన స్థలంలో బ్లాక్ బాక్స్‌ను గుర్తించామని, అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని బట్టి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయవచ్చునని పేర్కొన్నారు.