S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/20/2019 - 05:23

ఈ ఫొటోలో కుర్చీలో కూర్చున్న మేజర్ ఈశ్వర్ లాల్, సుభాష్ చంద్రబోస్ సారథ్యం వహించిన ఐఎన్‌ఏలో చురుకైన పాత్ర వహించారు. సింగపూర్‌లోని ఐఎన్‌ఏ కేంద్రం వద్ద మంగళవారం నివాళులు అర్పించేందుకు వచ్చిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు

11/20/2019 - 04:39

ఇస్లామాబాద్, నవంబర్ 19: భారత దేశ ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని తిరస్కరించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ను, భద్రతా మండలి అధ్యక్షున్ని కోరారు. ఈ మేరకు మంత్రి ఖురేషీ లేఖ మంగళవారం రాశారు. భారత ప్రభుత్వం జమ్మూ, కాశ్మీర్, లడక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ ఆగస్టు 5న ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

11/19/2019 - 23:55

టెల్ అవీవ్, నవంబర్ 19: నిటి నిల్వల పరిరక్షణ, నిర్వాహణలో ఇజ్రాయెల్ నంబర్ వన్‌గా నిలుస్తున్నదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారు. ఇజ్రాయిల్‌ను ఆయన ‘నీటి సూపర్ పవర్’గా అభివర్ణించారు.

11/19/2019 - 23:40

ఇస్లామాబాద్, నవంబర్ 19: దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌పై విచారణ జరిపిన ఆ దేశ ప్రత్యేక న్యాయ స్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 28న తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏవైనా చెప్పదలచుకుంటే ఈ నెల 26వ తేదీలోగా తమకు తెలియజేయాలని ప్రత్యేక న్యాయస్థానం మాజీ నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తరఫు న్యాయవాదికి సూచించింది.

11/18/2019 - 23:40

ఖాట్మండు, నవంబర్ 18: వివాదాస్పద కాలాపానీ ప్రాంతం నుంచి భారతదేశం వెంటనే తమ దళాలను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ డిమాండ్ చేశారు. తమ భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా అన్యాక్రాంతం కానివ్వమని, ఎవరు దురాక్రమణ చేసినా సహించేది లేదని ఆయన తెలిపారు. భారతదేశం ఇటీవల జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మ్యాప్‌లను విడుదల చేసింది.

11/18/2019 - 01:27

13 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపు*
నేడు అనురాధపురలో ప్రమాణ స్వీకారం

11/17/2019 - 05:04

వాషింగ్టన్, నవంబర్ 16: అస్సాంలో అమలు చేస్తున్న జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ) మతపరమయిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి, ముస్లింలను ఏ దేశానికి చెందని వారిగా చేయడానికి ఉపయోగిస్తున్న పనిముట్టు అని అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఏర్పాటు చేసిన ఫెడరల్ యూఎస్ కమిషన్ ఆరోపించింది.

11/17/2019 - 04:52

వాషింగ్టన్, నవంబర్ 16: మానవ హక్కులకు, పౌర స్వేచ్ఛకు ఉగ్రవాదం, ఛాందసవాద తీవ్రవాదం కన్నా మించిన పెద్ద ముప్పు మరోటి లేదని కాశ్మీరీ పండిట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అమెరికా సంస్థ యూఎస్ కాంగ్రెస్ కమిటీకి తెలియజేసింది. రాజకీయంగా ప్రేరేపితమయిన వాంగ్మూలాల వల్ల తప్పుదారి పట్టొద్దని సూచించింది.

11/17/2019 - 04:51

లండన్, నవంబర్ 16: ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు ఇటాలియన్ బంగారు సైతక శిల్పి అవార్డు లభించింది. గత వారం ఇటలీలోని లెస్సి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైతక శిల్పాల పోటీలో సుదర్శన్ పట్నాయక్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సైతక శిల్పి పట్నాయక్ మహాత్ముని సైతక శిల్పాన్ని రూపొందించి వీక్షకులను అబ్బుర పరిచారు.

11/15/2019 - 06:04

బ్రెసిలియా: పెట్టుబడులకు, వ్యాపారానుకూల పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐదు బ్రిక్స్ దేశాల వ్యాపారవేత్తలను ఉద్దేశించి గురువారం ఇక్కడ మాట్లాడిన మోదీ ‘ భారత్‌లో హద్దులేని అవకాశాలున్నాయి.. అనంతమైన పెట్టుబడులకు వీలుంది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరలిరండి..’ అని పిలుపునిచ్చారు.

Pages