S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/04/2019 - 01:40

బ్యాంకాంక్, నవంబర్ 3: ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో భారత దేశం అత్యంత కీలక రీతిలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నదని 10 దేశాల ఆసియా కూటమి స్పష్టం చేసింది. భారత్‌కు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటామని, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సవాళ్ళను ఉమ్మడి శక్తితో ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.

11/04/2019 - 01:38

బ్యాంకాక్, నవంబర్ 3: రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని భారత్-్థయ్‌లాండ్ సంకల్పించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా మధ్య ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒక అవగాహన కుదిరింది. వాణిజ్యాన్ని కూడా విస్తరించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయించారు.

11/04/2019 - 01:33

లండన్, నవంబర్ 3: వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధిస్తుందన్న గట్టి నమ్మకం ఏమీ లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అక్టోబర్ 31 డెడ్‌లైన్‌లోగా బ్రెగ్జిట్ లక్ష్యాన్ని తాను సాధించలేకపోవడాన్ని చింతిస్తున్నానని, ఈ వైఫల్యానికి కారణం పార్లమెంటేనని ఆయన ధ్వజమెత్తారు.

11/04/2019 - 01:32

వాషింగ్టన్, నవంబర్ 3: భారత్ నేతృత్వంలో దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించే దిశగా ముందుకు సాగుతోందని, 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు భాగాన్ని అందించగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా పరిశోధన వెల్లడించింది. ఐఎంఎఫ్ చేసిన ప్రపంచ భౌగోళిక విభజనలో దక్షిణాసియాలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు లేవు.

11/04/2019 - 00:55

బ్యాంకాక్, నవంబర్ 3: ఆసియాన్ దేశాలతో అన్ని రంగాల్లోనూ విస్తృత స్థాయి సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఈ కూటమిలో సభ్యత్వం కలిగిన 10 దేశాలతో భారత్ ఉపరితల, గగనతల, సముద్రపరమైన సంధానతను పెంపొందించుకుంటే ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరుగుతాయని అన్నారు.

11/03/2019 - 02:11

బొమాకో, నవంబర్ 2: మాలీ దేశ ఈశాన్య ప్రాంతంలోని ఓ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 53 మంది జవాన్లు మరణించారు. ఇటీవల కాలంలో ఇంత ఘోరమైన దాడి తమ దేశంపై జరగలేదని, ఈ దాడిలో ఓ పౌరుడు కూడా మరణించాడని ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టామని కమ్యూనికేషన్ల మంత్రి యాయా సంగారే తెలిపారు.

11/03/2019 - 01:13

బ్యాంకాక్, నవంబర్ 2: కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్యాంకాక్‌కు వచ్చిన ఆయన శనివారం భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు అసాధ్యం గా భావించిన లక్ష్యాలనే తమ ప్రభుత్వం సాధిస్తోందని, ఆ దిశగానే మరింత ముం దుకు వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

11/02/2019 - 23:46

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపు దాల్చుతోంది. వేలాదిగా తరలివచ్చిన ఆందోళన కారులు ఇస్లామాబాద్‌లోనే బైఠాయించారు. ఆజాది మార్చ్ పేరుతో చేపట్టిన ఈ ఉద్యమానికి జమాయిత్ ఉలేమా ఏ ఇస్లామ్ సారథ్యం వహిస్తోంది. ఉద్యమకారులు విధ్వంసానికి దిగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

11/02/2019 - 23:29

న్యూయార్క్, నవంబర్ 2: ఈ నెలలో జరిగే భద్రత మండలి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని చర్చించడం లేదని మండలి అధ్యక్షుడు, యూకే శాశ్వత ప్రతినిధి కిరేణ్ పియాస్ స్పష్టం చేశారు. నవంబర్ నెలలో ఆయన అధ్యక్షతనే భద్రతా మండలి సమావేశాలు జరుగుతాయి. కాశ్మీర్ కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యవసరంగా చర్చించాల్సిన పరిణామాలెన్నో ఉన్నాయని ఆమె తెలిపారు.

11/02/2019 - 01:08

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 1,600కు పైగా మంది విద్యార్థులు ‘2020 న్యూ కొలంబో ప్లాన్ మొబిలిటి ప్రోగ్రాం’ కింద భారత్‌లో చదువుకోవడంతో పాటు ప్రాజెక్టులు చేయనున్నారు. ఢిల్లీలోని ఆస్ట్రేలియా ఎంబసీ ఈ విషయం వెల్లడించింది. ‘్భరత్‌లో ఉన్న 64 ప్రాజెక్టుల ద్వారా వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా యూనివర్శిటీలు తమ విద్యార్థులను అక్కడికి పంపించనున్నాయి.

Pages