అంతర్జాతీయం

కలసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 3: రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని భారత్-్థయ్‌లాండ్ సంకల్పించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా మధ్య ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒక అవగాహన కుదిరింది. వాణిజ్యాన్ని కూడా విస్తరించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయించారు. భౌతిక, డిజిటల్ రంగాలు సహా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య బలమైన బంధం పెంపొందాలని నిర్ణయించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని ద్వైపాక్షిక వాణిజ్య అనుబంధం ద్వారా మరింతగా విస్తరించుకోవాలన్న ధృడ సంకల్పం ఈ చర్చల్లో వ్యక్తమైందని వెల్లడించింది. ఇండో- ఆసియా, తూర్పు ఆసియా, ఆర్‌సీఈపీ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చారు. కాగా, ఇప్పటివరకు థాయ్‌లాండ్- భారత్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక బంధా న్ని ఇరువురు నేతలు సమీక్షించారని, రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో తరచూ సమావేశాలు జరగడం వల్ల సహకార వృద్ధికి ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు ప్రధానులు మాట్లాడుకున్నారని తెలిపింది.
ఇండోనేషియా అధ్యక్షుడితోనూ భేటీ
ఇండోనేషియా అధ్యక్షుడు జఫో విడూడూతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత పురోభివృద్ధికి కలసికట్టుగా కూడా ఇరువురు నేతలు నిర్ణయించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు విడూడూను మోదీ అభినందించారు. భారత్- ఇండోనేషియా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య, బహుళ సమాజం కలిగిన దేశాలని పేర్కొన్న మోదీ రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడుల రంగంలో మరింత సాన్నిహిత్యం అవసరమని స్పష్టం చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పెట్టుబడులకు భారత్‌లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఇండోనేషియా కంపెనీలకు మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాల్సిందిగా ఇండోనేషియా అధ్యక్షుడిని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించారు.

*చిత్రం... ప్రధాని మోదీకీ స్వాగతం చెబుతున్న దాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా