S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/02/2019 - 00:03

ఇస్లామాబాద్, నవంబర్ 1: గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉందంటూ పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాయి. ఇమ్రాన్ ఖాన్ బూటకపు ప్రభుత్వం ఇంకేమాత్రం అధికారంలో ఉండడానికి వీల్లేదని ఈ ఆజాదీ మార్చ్‌లో విపక్ష నేతలు స్పష్టం చేశారు.

11/02/2019 - 00:02

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ఎంతగా తనపై ఒత్తిడి తీసుకువచ్చినా, ఎన్ని ధర్నాలు, మార్చ్‌లు చేసినా లొంగేది లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెగేసి చెప్పారు. గిరిజిత్-బాల్టిస్తాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన నిరసనకారులపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరెన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు కూర్చోండి. ఆహారం అయిపోతే పంపిస్తాం. అయితే, నానుంచి ఈ విపక్ష నేతలకు ఎలాంటి ఉపశమనం ఉండదు’ అని అన్నారు.

11/02/2019 - 00:01

ఐక్యరాజ్య సమితి, నవంబర్ 1: ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ అంశంపై చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు’ అజెండాలో ఎన్నడూ జమ్మూకాశ్మీర్ లేదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తన ‘ప్రాదేశిక దురాశ’కు విశ్వసనీయతను సంపాదించడం కోసం ‘పిచ్చి ప్రయత్నాలు’ చేస్తోందని భారత్ నిశితంగా విమర్శించింది.

11/01/2019 - 23:59

లండన్, నవంబర్ 1: ఓ పక్క బ్రెగ్జిట్ వ్యవహారం బ్రిటన్ రాజకీయ పార్టీల మధ్య పెను చిచ్చు రేపుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా మారాయి. ఐరోపా యూనియన్ నుంచి నిష్క్రమించడానికి సంబంధించిన తన ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో ఇక ఎన్నికలే శరణ్యం అన్నట్టుగా ప్రధాని బోరిస్ జాన్సన్ ముందుకు సాగుతున్నారు.

11/01/2019 - 23:58

ఇస్లామాబాద్, నవంబర్ 1: కర్తార్‌పూర్‌కు వచ్చే భారతీయ సిక్కు యాత్రికులకు ఎలాంటి పాస్‌పోర్ట్ ఉండాల్సిన అవసరం లేదని, కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ప్రకటించారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించేందుకు పది రోజుల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవలసిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

11/01/2019 - 23:29

న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత్-జర్మనీల మధ్య అన్ని రంగాల్లోనూ గుణాత్మక సంబంధాలు పెంపొందుతున్నాయని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో ఇరు దేశాలు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

10/31/2019 - 22:45

లాహోర్, అక్టోబర్ 31: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గురువారం ఓ రైల్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిన ఘోర ప్రమాదంలో 74మంది దుర్మరణం చెందారు. అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించిందని, కరాచీ నుంచి రావల్పిండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

10/31/2019 - 22:37

న్యూయార్క్, అక్టోబర్ 31: భారత నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అరెస్టు, నిర్బంధానికి సంబంధించి వియన్నా ఒడంబడికను పాకిస్తాన్ ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దు ఇలాకావి యూసఫ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

10/31/2019 - 04:36

వాషింగ్టన్, అక్టోబర్ 30: పెరుగుతున్న సముద్ర మట్టం ప్రతికూల ప్రభావం పడుతున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా సహా ఇతర ఆసియా దేశాలలో సముద్ర తీర ప్రాంతాలలో అత్యంత ఎత్తయిన అల తాకే రేఖకు లోపల నివసించే ప్రజల సంఖ్య ఈ శతాబ్దం చివరి నాటికి అయిదింతల నుంచి పదింతల వరకు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

10/30/2019 - 22:43

క్యాన్‌బెర్ర, అక్టోబర్ 30: ఆస్ట్రేలియా తూర్పు తీరంలో గల అడవికి అంటుకున్న మంటల్లో కోలా జాతికి చెందిన వందలాది ఎలుగు బంట్లు మరణించి ఉంటాయని అటవీ సంరక్షణాధికారులు ఆందోళన చెందుతున్నారు. అడవి మంటల బారి నుంచి బయటపడిన వాటి కోసం గురువారం నుంచి శోధన మొదలు పెట్టవచ్చని పోర్ట్ మాక్యురీలోని ఆసుపత్రి అధ్యక్షుడు సు అష్టన్ తెలిపారు.

Pages