S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/26/2019 - 23:31

ఇస్లామాబాద్, అక్టోబర్ 26: భారత సైనిక ప్రధానాధికారి బిపిన్ రావత్ రెచ్చగొట్టేలా, యుద్ధాని ప్రేరేపించేలా ప్రకటనలు చేస్తున్నారని పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాకిస్తాన్‌ను పదేపదే రెచ్చగొడుతూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని సైన్యం ఆరోపించింది. ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ‘ఉగ్రవాదుల నియంత్రణలోనే ఉంది’అన్న రావత్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విరుచుకుపడింది.

10/25/2019 - 23:57

బకు (అజర్‌బైజాన్), అక్టోబర్ 25: అంతర్జాతీయంగా తలెత్తుతున్న సంక్లిష్ట సవాళ్ళ నేపథ్యంలో అలీనోద్యమాన్ని మరింత పటిష్టంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు అలీనోద్యమాన్ని సాధించిన విజయాలను పురస్కరించుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

10/25/2019 - 23:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా ఉగ్రవాదుల గుప్పిట్లో ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. శుక్రవారం జరిగిన ఫీల్డ్ చీఫ్ మార్షల్ కేఎం కరియప్ప స్మారకోపన్యాసం సభలో జనరల్ బిపిన్ రావత్ ప్రసంగిస్తూ గిల్గిట్-బలిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు అక్రమంగా పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయని విమర్శించారు.

10/25/2019 - 23:41

వాషింగ్టన్, అక్టోబర్ 25: ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణాన్ని తొలగించే విషయంలో పాకిస్తాన్ జవాబుదారీ వహించాలని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కలిసి నడిచే అవకాశమే లేదని వ్యాఖ్యానించింది.

10/25/2019 - 23:39

కొలంబో, అక్టోబర్ 25: భారత్‌లో మంచి సంబంధాలు నెరపడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని శ్రీలంక పొదుజన పెరమున పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) అధ్యక్ష అభ్యర్థి గొటాభాయ రాజపక్సే ప్రకటించారు. ఎస్‌ల్‌పీసీ మేనిఫెస్టోను శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే భారత్‌తోపాటు అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు నెలకొల్పేందుకు అనువైన విదేశాంగ విధానం రూపొందిస్తామని ఆయన చెప్పారు.

10/25/2019 - 23:36

బిహార్‌లోని నలందా జిల్లా రాజగిరిలో ఏర్పాటు చేసిన శాంతి స్థూపం 50వ వార్షికోత్సవం సందర్భంగా
శుక్రవారం జపాన్ ప్రతినిధులతో సమావేశమైన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు

10/25/2019 - 00:46

లాహోర్/ డేరా బాబా నానక్: భారత్, పాకిస్తాన్ గురువారం కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తెచ్చే చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఉన్నప్పటికీ, కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తెచ్చే ఒప్పందం కుదరడం విశేషం. ఈ ఒప్పందం వల్ల భారత్‌లోని సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లోని పవిత్రమైన దర్బార్ సాహిబ్‌ను సందర్శించడానికి వీలు కలుగుతుంది.

10/24/2019 - 22:24

వాషింగ్టన్, అక్టోబర్ 24: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపారం) చేసే 50 దేశాల సరసన చేరాలంటే భారత్ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని ప్రపపంచ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. వచ్చే మూడు నాలుగేళ్లలో భారత్ ఈ దిశగా ఆలోచించి ధైర్యంతో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని గురువారం ఇక్కడ పేర్కొన్నారు.

10/24/2019 - 04:51

లండన్, అక్టోబర్ 23: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్‌కు) ఇచ్చిన అక్టోబర్ 31 గడువును మరో మూడు నెలల పాటు పొడిగించడానికి ఈయూ ఒప్పుకుంటే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సిద్ధమవుతున్నారు.

10/24/2019 - 04:16

లండన్, అక్టోబర్ 23: విషక్రిమి నాశకాలను తట్టుకునే శక్తి గల ‘సూపర్‌బగ్’ ఈకోలి బ్యాక్టీరియా విస్తరించడానికి కోడికూర, మాంసం, ఇతర ఆహార పదార్థాలను తగినంతగా ఉడికించకుండా తినడంకన్నా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే ఎక్కువ కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయింది. జంతువుల వలెనే మనుషులు కూడా తమకు హాని కలగకుండా తమ పేగుల్లో ఈకోలి బ్యాక్టీరియాను మోస్తున్నారు.

Pages