అంతర్జాతీయం

భారత్‌తో స్నేహానికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 25: భారత్‌లో మంచి సంబంధాలు నెరపడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని శ్రీలంక పొదుజన పెరమున పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) అధ్యక్ష అభ్యర్థి గొటాభాయ రాజపక్సే ప్రకటించారు. ఎస్‌ల్‌పీసీ మేనిఫెస్టోను శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే భారత్‌తోపాటు అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు నెలకొల్పేందుకు అనువైన విదేశాంగ విధానం రూపొందిస్తామని ఆయన చెప్పారు. సార్క్‌తోనూ, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్(బీఐఎంఎస్‌టీఈసీ)తో మెరుగైన సంబంధాలకు కృషి చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.‘్భరత్‌లో మైరుగైన సంబంధాలు కలిగి ఉండాలన్నది మా ఉద్దేశం. సింహళ భాషలో రూపొందించిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన మీడి యాతో మాట్లాడారు. శ్రీలంకలో నవంబర్ 16న ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా 35 మంది అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డుగా చెప్పవచ్చు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే చిన్న తమ్ముడే గొటాభాయ రాజపక్సే. రాజపక్సే(70) అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 2015లో మహింద రాజపక్సే భారత్‌తోపాటు పశ్చిమ దేశాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికకాకుండా ఆ దేశాలు అవరోధాలు కల్పించాయని ఆయన ఆరోపించారు. మైత్రిపాల సిరిసేన అధ్యక్షుడు కావడానికి భారత్, పశ్చిమ దేశాలు సహకరించాయని ఆ విధంగా తన పతనానికి కారణమయ్యాయని మహింద ధ్వజమెత్తారు. తమ విదేశాంగ విధానం స్పష్టమైన వైఖరితో ఉంటుందని, ఏ దేశానికి భయపడి మూలనదాగే పరిస్థితి ఉండదని గొటాభాయ తన మేనిఫెస్టోలో ప్రకటించారు.‘మా సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటాం. అదే సమయంలో మిగతా దేశాలతో సంబంధాలు నెరపుతాం. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగించుకుంటాం’అని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆయన ప్రకటించారు. నవంబర్ 16న జరిగే అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఈనెల 30 నుంచి ఉంటుంది. భద్రతా దళాలు, ఇతర అధికారులు ఎన్నికల విధులకు నియమితులు కానున్నందున ఓటు అర్హత ఉన్నవారి కోసం పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడుతుంది. మొత్తం ఐదు లక్షల పోస్టల్ ఓట్లు ఉంటాయని అధికారులు అంచనా. కాగా అధికార పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాస నవంబర్ 1న మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 21 మిలియన్ జనాభాలో 15 మిలియన్ల మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికైన అధ్యక్షుడు ఐదేళ్లు అధికారంలో ఉంటారు.