అంతర్జాతీయం

ఉగ్రవాదుల గుప్పిట పీవోకే సైనిక చీఫ్ జనరల్ బిపిన్ రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా ఉగ్రవాదుల గుప్పిట్లో ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. శుక్రవారం జరిగిన ఫీల్డ్ చీఫ్ మార్షల్ కేఎం కరియప్ప స్మారకోపన్యాసం సభలో జనరల్ బిపిన్ రావత్ ప్రసంగిస్తూ గిల్గిట్-బలిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు అక్రమంగా పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయని విమర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి దుస్సాహసాలకు పాల్పడరాదని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఎటువంటి దుస్సాహసాలకు పాల్పడినా తమ దేశ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ అధీనంలో లేదని, పాక్ ఉగ్రవాదుల గుప్పిట్లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంపై పాక్ రాద్ధాంతం చేయడంలో అర్థం లేదన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిని తర్వాత పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లో అని పిలుస్తున్నామంటే అందులో గిల్గిట్-బలిస్తాన్, పీవోకే కూడా భాగమేనని అన్నారు. భారత ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఎగిరి పడుతున్నది కానీ పివోకే మాత్రం ఉగ్రవాదుల గుప్పిట్లో ఉందన్నారు. లోగడ రెండు సార్లు భారత రాజ్యాంగంలోని 370-అధికరణను సవరించడం జరిగిందన్నారు. జమ్మూ-కాశ్మీర్ నాయకత్వాన్ని సదర్-ఏ-రియాసత్‌గా, తర్వాత ప్రధాన మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మార్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఇటీవల కాశ్మీర్ లోయలో యాపిల్ వర్తకులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్‌లో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని జనరల్ రావత్ విమర్శించారు. ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రవాణా వ్యవస్థ, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు పునరుద్ధరించబడిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు.