S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/17/2019 - 04:04

లండన్ : బ్రెగ్జిట్ అనిశ్చితి పరిస్థితి యూరోపియన్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఎవరికివారు ఊహాగానాలు చేస్తుండడంతో స్టెర్లింగ్ విలువ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ యథాతథంగా అమలు చేస్తుందా అన్నది అనుమానంగా మారింది. ప్రత్యేకించి గ్రేట్ బ్రిటన్ వైఖరి అగమ్యగోచరంగా ఉండడంతో మార్కెట్ స్థిరత్వాన్ని బలపడలేకపోతోంది.

10/16/2019 - 22:47

అంకారాలో జరిగిన పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియానుద్దేశించి మాట్లాడుతున్న టర్కిస్ అధ్యక్షుడు రెసెప్ తయ్యఫ్ ఎర్డోగాన్. సిరియాలోని కుర్దిష్ దళాలు వెంటనే సరిహద్దు ఆవలికి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. సిరియాలో ప్రజాస్వామ్య పాలన కోసం జరుగుతున్న ప్రయత్నాలను టర్కీ అడ్డుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

10/16/2019 - 22:44

టౌలోజ్‌లో జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కల్, ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గులాం పరితో కలసి ఎయిర్‌బస్-ఏ 350 విమానాన్ని పరిశీస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి). యూరోపియన్
యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి

10/15/2019 - 23:58

వాషింగ్టన్: టర్కీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఆ దేశంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఆర్థిక వ్యవస్థను వేగంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ టరుూప్ ఎర్డోగాన్‌కు ఫోన్ చేసి, అంకారాతో 100 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు.

10/15/2019 - 23:43

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 15: అణుయుద్ధం పేరుతో కవ్వించి, బెదిరించి, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని పాకిస్తాన్‌పై భారత్ ధ్వజమెత్తింది. భారత్‌తో అణు యుద్ధం తప్పకపోవచ్చని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఈ విధంగా కవ్వించి, తప్పించుకోవడం పాక్ నైజమని విమర్శించింది.

10/15/2019 - 00:31

స్టాక్‌హోం, అక్టోబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి వినూత్న ప్రయోగాలతో ఆచరణీయ ఫలితాలను అందుబాటులోకి తెచ్చిన భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ సహా ముగ్గురు ఆర్థిక వేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. విజేతల్లో అభిజిత్ భార్య ఈస్దర్ డఫ్లొ, థార్వాడ్ ప్రొఫెసర్ మైఖేల్ క్రమర్ కూడా ఉన్నారు.

10/14/2019 - 05:20

టోక్యో, అక్టోబర్ 13: శక్తివంతమయిన తుపా ను హజీబిస్ జపాన్‌లో బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఇప్పటికే 26 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. ప్రచండ వేగంతో దూసుకొచ్చిన హజీబిస్ తుపాను శనివారమే జపాన్‌ను ఢీకొంది. ఈ తుపాను కారణంగా అసాధారణ స్థాయిలో వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

10/12/2019 - 23:31

ఫుజిసావా (జపాన్), అక్టోబర్ 12: గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో ఓ భయానక పెను తుఫాన్ టోక్యో, దాని పరిసర ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ప్రచండ గాలులు, కుండపోత వర్షంతో వీధులు, బీచ్‌లు, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యమైపోయాయి. ఈ భయానక ప్రకృతి విలయం గురించి గంటలకు ముందే సమాచారం అందడంతో ప్రజలు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను నిల్వ చేసుకోవడంతో అన్ని మార్కెట్లు ఖాళీ అయిపోయాయి.

10/11/2019 - 23:46

ఓస్లో, అక్టోబర్ 11: ప్రపంచ శాంతికి విశేషంగా కృషి చేస్తున్న ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్ పురస్కారం లభించింది. ఇరిట్రియాతో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడమేగాక, ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అబీని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్టు నార్వేకు చెందిన నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది.

10/11/2019 - 22:43

లండన్, అక్టోబర్ 11: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బ్రిటన్ ప్రభుత్వం ఒక స్మారక నాణేన్ని విడుదల చేయనుందని దేశ ఆర్థిక మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. ఈ స్మారక నాణేన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నం కావాలని తాను ఇప్పటికే దేశ రాయల్ మింట్‌ను ఆదేశించినట్టు పాకిస్తాన్ సంతతికి చెందిన జావిద్ వెల్లడించారు.

Pages