అంతర్జాతీయం

పేదరిక నిర్మూలనపై కొత్త వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి వినూత్న ప్రయోగాలతో ఆచరణీయ ఫలితాలను అందుబాటులోకి తెచ్చిన భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ సహా ముగ్గురు ఆర్థిక వేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. విజేతల్లో అభిజిత్ భార్య ఈస్దర్ డఫ్లొ, థార్వాడ్ ప్రొఫెసర్ మైఖేల్ క్రమర్ కూడా ఉన్నారు. బెనర్జీతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన ఆయన భార్య డఫ్లొ మసాచుసెట్స్ టెక్నాలజీ సంస్థ (ఎంఐటీ)లో పని చేస్తున్నారు. ఇలాంటి అరుదైన అవకాశాలు జీవితంలో చాలా అరుదుగానే వస్తాయని, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని 55 ఏళ్ళ బెనర్జీ అన్నారు. ఆయన భార్య 36 సంవత్సరాల డఫ్లొ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాదారుగా పని చేశారు. ఈ సమున్నత పురస్కారాన్ని ఇప్పటి వరకు పొందిన రెండో మహిళగానే కాకుండా అతి చిన్న వయస్సులోనే అర్థశాస్త్ర నోబెల్‌ను పొందిన వనితగా కూడా ఆమె ఘనతను సాధించారు. ఈ అవార్డు లభించడం తనకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తున్నదని అన్నారు. పేదరిక నిర్మూలనపై తాము చేసిన ప్రయోగాలతో గుర్తింపు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆమె
పేర్కొన్నారు. ఈ అవార్డుల్లో భాగంగా విజేతలకు 9 లక్షల 18 వేల డాలర్ల నగదు, స్వర్ణపతకం, ఓ ప్రశంసా పత్రం లభిస్తాయి. ఈ మొత్తాన్ని ఈ ముగ్గురు విజేతలు సంయుక్తంగా పంచుకుంటారు. ఈ ఉన్నతమైన పురస్కారాన్ని అందుకున్నందుకు భారత రాష్టప్రతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా అనేక మంది బెనర్జీని అభినందించారు. ఈ ముగ్గురు ఆర్థిక వేత్తలు చేసిన వినూత్న పరిశోధన వల్ల భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి కొత్త ద్వారాలు తెరచుకున్నాయని రాష్టప్రతి కోవింద్ అన్నారు. 2019 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో నోబెల్ అందుకున్నందుకు అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య డఫ్లొ, కెమెర్లను అభినందిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రవేశపెట్టిన న్యాయ పథకానికి స్పూర్తిని ఇచ్చింది బెనర్జీ చేసిన వినూత్న పరిశోధనేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ముగ్గురు ఆర్థిక వేత్తలు చేసిన పరిశోధనల వల్ల అంతర్జాతీయంగా పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం బలపడిందని, కేవలం 2 దశాబ్దాల్లో వీరి ప్రయోగాత్మక పరిశోధనలు, ప్రగతిశీల ఆర్థిక విధానాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని నోబెల్ అకాడమీ తెలిపింది. వీరు తెరపైకి తెచ్చిన కొత్త ఆర్థిక విధానాల వల్ల పేదరిక నిర్మూలన పరిశోధనలు ముమ్మరం అయ్యాయని పేర్కొంది. పేదరికాన్ని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై విశ్వసనీయ మార్గాలను వీరు అందుబాటులోకి తెచ్చారని నోబెల్ అకాడమీ తెలిపింది. వీరి ప్రయోగాల ఫలితంగా భారత దేశంలోనే 50 లక్షల మందికి పైగా పిల్లలు లబ్ది పొందారని వివరించింది. అలాగే అనేక దేశాల్లో ముందస్తు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు భారీగా సబ్సిడీలు అందించడానికి కూడా వీరి కృషే కారణమని నోబెల్ సంస్థ పేర్కొంది.
కోల్‌కత్తా యూనివర్సిటీలో చదువుకున్న అభిజిత్, జవహార్‌లాల్ వర్సిటీ అలాగే హార్వర్డ్ వర్సిటీలో కూడా అర్థశాస్త్రాన్ని అభ్యసించారు. 1988లో హార్వర్డ్ వర్సిటీ ఆయనకు పిహెచ్‌డీ ప్రదానం చేసింది. ప్రస్తుతం ఆయన ఫోల్డ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో అర్థశాస్త్ర పరిశోధకునిగా పని చేస్తున్నారు. తన కుమారుడితో పాటు తన కోడలికి కూడా అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని బెనర్జీ తల్లి నిర్మలా బెనర్జీ కోల్‌కత్తాలో అన్నారు.

*చిత్రాలు.. అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఈస్దర్ డఫ్లొ
*అమెరికా ప్రొఫెసర్ క్రెమెర్