S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/21/2019 - 05:07

లండన్, అక్టోబర్ 20: కాశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లండన్‌లో దీపావళి (ఆదివారం) నాడు ర్యాలీ నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను లండన్ నగర మేయర్ సాదిక్ ఖాన్ ఖండించారు. ఈ ర్యాలీ వల్ల నగరంలో ప్రజల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిర్వాహకులు, ర్యాలీలో పాల్గొనాలని భావిస్తున్న ప్రజలు తమ నిరసన ర్యాలీని రద్దు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

10/21/2019 - 03:59

మనీలా, అక్టోబర్ 20: హింసాత్మక వాతావరణం సర్వత్రా ప్రబలుతున్న నేటి పరిస్థితుల్లో శాంతి, సౌభ్రాతృత్వాల స్థాపనకు భారత నాగరికతే గీటురాయి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో భారత సంతతిని ఉద్దేశించి మాట్లాడిన కోవింద్ ‘భారత వారసత్వ విలువలను, సంప్రదాయాలను పెంపొందించండి’ అని పిలుపునిచ్చారు.

10/21/2019 - 03:48

వాషింగ్టన్, అక్టోబర్ 20: వ్యూహాత్మక రీతిలో ద్వైపాక్షిక బంధాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి భారత్-అమెరికాలు మరో అడుగు ముందుకు వేయబోతున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జరుగబోయే సుదీర్ఘ వాణిజ్య, భౌగోళిక రాజకీయ భేటీకి సన్నద్ధమవుతున్నారు.

10/21/2019 - 01:10

ఇస్లామాబాద్: ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిందంటూ వచ్చిన కథనాలను పాకిస్తాన్ తిరస్కరించింది. భారత్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదని, ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఉగ్ర శిబిరాల ప్రాంతాలకు భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల దౌత్యవేత్తలను తీసుకెళ్ళి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని పాక్ ప్రకటించింది.

10/21/2019 - 00:45

హాంకాంగ్ మరోసారి పోలీసులు, ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారుల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలతో అట్టుడికింది. ఇటు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేస్తే, ఆందోళనకారులు వారిపై పెట్రో బాంబులు విసరడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పోలీస్ నిషేధాన్ని ఉల్లంఘించి వేల సంఖ్యలో ఆందోళనకారులు వీధికెక్కడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు.

10/20/2019 - 23:59

వాషింగ్టన్, అక్టోబర్ 20: వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ అంశంపై త్వరలోనే కీలక ఒప్పందం కుదరగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

10/20/2019 - 02:23

మనీలా, అక్టోబర్ 19: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిలిప్పీన్స్ పర్యటన సుహృద్భావ వాతావరణంలో సాగుతోంది. కోవింద్ ఐదు రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. భారత్‌లో కాలేయ మార్చిడి చేయించుకుని కోలుకుంటున్న చిన్నారుల తల్లిదండ్రులతో రాష్టప్రతి భేటీ అయ్యారు. దక్షిణాసియా దేశానికి వైద్యపరంగా అందిస్తున్న సేవలను ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు.

10/20/2019 - 02:18

మనీలా, అక్టోబర్ 19: సాధారణంగా విమాన ప్రయాణికులకు లగేజీ సమస్య ఉంటుంది. నిర్ణీత పరిమితికి మించి లగేజి పెరిగితే అందుకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది, కానీ ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవడానికి పిలిప్పిన్స్‌లోని ఓ మహిళ కొత్త పద్ధతి ఆలోచించారు. ఏకంగా రెండున్నర కిలోల దుస్తులను ధరించి విమానాశ్రయానికి వచ్చారు. అంటే తాను తీసుకోవాల్సిన బట్టలన్నింటినీ ఆమె ధరించేశారన్నమాట.

10/20/2019 - 02:16

యునైటెడ్ నేషన్స్, అక్టోబర్ 19: ఐరాసలో జమ్మూకాశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను వక్రీకరించడమే అజెండాగా పెట్టుకుని అదే పనిగా ఆరోపణలు చేస్తోందని ఐరాస శాశ్వత మిషన్‌లోని భారత ప్రతినిధి దీపక్ మిశ్రా ధ్వజమెత్తారు.

10/20/2019 - 02:14

వాషింగ్టన్, అక్టోబర్ 19: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలకే కాదు, దేశంలో ఉన్న రాజకీయ పక్షాలకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను ‘అధికార దర్పంగా, వౌలికమైన విపత్తుగా’ అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనదైన శైలిలో అందుకు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు.

Pages