అంతర్జాతీయం

ఎలా ఉన్నారు.. బాగున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, అక్టోబర్ 19: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిలిప్పీన్స్ పర్యటన సుహృద్భావ వాతావరణంలో సాగుతోంది. కోవింద్ ఐదు రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. భారత్‌లో కాలేయ మార్చిడి చేయించుకుని కోలుకుంటున్న చిన్నారుల తల్లిదండ్రులతో రాష్టప్రతి భేటీ అయ్యారు. దక్షిణాసియా దేశానికి వైద్యపరంగా అందిస్తున్న సేవలను ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. గత 28 నెలల్లో 35 మంది చిన్నారులకు భారత్‌లో కాలేయ మార్పిడి శస్తచ్రికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఫిలిప్పీన్స్- ఇండియా పెడియాట్రిక్ ట్రాన్స్‌ప్లంటేషన్ కార్యక్రమం కింద ఈ శస్తచ్రికిత్సలు జరిగాయి. ఫిలిప్పీన్స్‌లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడకు వచ్చిన భారత రాష్ట్రపతి శనివారం నాడు చిన్నారుల తల్లిదండ్రులతో ముఖాముఖి కలిశారు. ఈ సందర్భంగా కోవింద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులను కలుసుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఫిలిప్పీన్స్‌ మధ్య మానవ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ఈ సంఘటనలు రుజువుచేస్తున్నాయని రాష్టప్రతి స్పష్టం చేశారు. ‘లివర్ మార్పిడి చికిత్స విజయం వంతంగా నిర్వహించం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను ఇవి మరింత ఇనుమడిస్తాయి’ అని ఆయన అన్నారు. పిల్లలు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారన్న తల్లిదండ్రుల తృప్తి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాష్టప్రతి తెలిపారు. ‘చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అంటూ కోవింద్ ట్వీట్ చేశారు. భారత వైద్య సంస్థలు ఫిలిప్పీన్స్‌తో కలిసి మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రపతి పర్యటన విశేషాలను విదేశాంగ శాఖ కార్యదర్శి రవీష్‌కుమార్ ట్వీట్ చేశారు. ‘్ఫలిప్పినో చిన్నారుల తల్లిదండ్రులతో రాష్ట్రపతి ముఖాముఖి జరిగింది. తల్లిదండ్రులు చెప్పిన విషయాలన్నీ కోవింద్ ఓపిగ్గా విన్నారు. మ్యాక్స్, అపోలో వైద్యులు మా పిల్లలకు ప్రాణధానం చేశారని తల్లిదండ్రులు చెప్పారు’ అని ట్వీట్ చేశారు. వైద్య సేవలకు సంబంధించిన ఖర్చులు ఫిక్సీ ఫిలిప్పినో చాప్టర్ భరించింది. పేద తల్లిదండ్రులకు సంస్థ అండగా నిలిచిందని కుమార్ పేర్కొన్నారు. దేశంలో కాలేయ మార్పిడికి సంబంధించిన సౌకర్యాలు, పరికాలు అందుబాటులోలేవని ఫిలిప్పీన్స్ మీడి యా వెల్లడించింది. ఇలాంటి సేవలు అధి క వ్యయంతో కూడుకున్న వ్యవహారం. వైద్య సేవలు అందుబాటులో ఉండడం, వ్యయం కూడా తక్కువ కావడంతో చాప్టర్ సహకారంతో తల్లిదండ్రులు భారత్‌కు వెళ్తున్నట్టు ఫిలిప్పీన్స్ స్టార్ పత్రిక పేర్కొంది. ఇలా ఉండగా భారత రాష్ట్రపతి కోవింద్ మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌ను సందర్శించారు. అక్కడ జైపూర్‌లో తయారు చేసిన కృతిమ అవయవాలు ఉచితంగా అందజేశారు. ఫిలిప్పీన్స్‌లోని మూడు కేంద్రాల్లో ఇప్పటి వరకూ 15వేల పరికరాలు ఇచ్చారు.