అంతర్జాతీయం

చెప్పిందొకటి.. చేసిందొకటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 19: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలకే కాదు, దేశంలో ఉన్న రాజకీయ పక్షాలకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను ‘అధికార దర్పంగా, వౌలికమైన విపత్తుగా’ అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనదైన శైలిలో అందుకు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. ఒబామాకు మించిన స్థాయిలోనే ఏ ఏడాదికి ఆ ఏడాది అత్యధిక స్థాయిలో కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేస్తుండడమే సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఒబామా తన అధ్యక్ష కాలంలో జారీ చేసిన ఆదేశాల సంఖ్యను తన మూడేళ్ల పదవీ కాలంలోనే ట్రంప్ దాటేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామా తీరును ఈ అంశంపైనే ట్రంప్ ఎండగట్టారు. అంతేకాదు, కేవలం కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం వల్ల దేశం నడవదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయనే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడంలో అతి తక్కువ వ్యవధిలోనే ఒబామాను మించిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు వారాల వ్యవధిలోనే ట్రంప్ ఐదు కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జారీ చేసే ఆదేశాల కు ఓ చట్టానికి ఉన్నంత ప్రభావం ఉంటుంది. అయితే, వీటిని రద్దు చేసే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు ఉంటుంది. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ రకమైన కార్యనిర్వాహక ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు జారీ చేయగలుగుతా రు. అయితే, ఒక అధ్యక్షుడు జారీ చేసిన ఆదేశాలను ఆయన తర్వాత ఈ పదవిని చేపట్టే దేశాధినేత ఎవరైనా రద్దు చేసే అవకాశం ఎంతైనా ఉంది.

*చిత్రం... డొనాల్డ్ ట్రంప్